S. S.Rajamouli: జక్కన్న శ్రమకు దక్కిన ఫలితం.. ఓటీటీలో రాణిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర ‘
పాన్ ఇండియన్ సినిమాలు ఎవరు తెరకెక్కించాలన్నా... రాజమౌళి దగ్గరే సలహాలు తీసుకునే స్టేజ్‌కు వచ్చారు. బాలీవుడ్ మేకర్స్ అయితే.. సౌత్ ఇండియాలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు.. జక్కన్నను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశారు.
లార్జర్ దెన్ లైఫ్ సినిమా కాన్సెప్ట్ తో.. పాన్ ఇండియా సినిమాలకు ప్రాణం పోసిన రాజమౌళి.. ఇప్పుడేకంగా.. ఇండియన్ పాన్ ఇండియన్ సినిమాలకు పితామహుడైపోయారు. పాన్ ఇండియన్ సినిమాలు ఎవరు తెరకెక్కించాలన్నా.. రాజమౌళి దగ్గరే సలహాలు తీసుకునే స్టేజ్‌కు వచ్చారు. బాలీవుడ్ మేకర్స్ అయితే.. సౌత్ ఇండియాలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు.. జక్కన్నను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశారు. ఆయనను ముందు పెట్టుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి.. భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు.
ఇక కరణ్ జోహార్.. అయాన్ ముఖర్జి.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర సినిమాను కూడా.. సౌత్‌లో… రాజమౌళి సమర్పణలో నే రిలీజ్ చేశారు. రాజమౌళి కూడా.. ముందుండి ఈ సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ , శాండివుడ్‌లలో ప్రమోట్ చేశారు. తన మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో.. మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చేలా చేశారు.
కాని.. రాజమౌళి ఇమేజ్ మార్క్ కలెన్లు మాత్రం బ్రహ్మస్త్ర కు రాకపోవడంతో.. జక్కన్న తో పాటు.. ఈ మూవీ మేకర్స్ కూడా విపరీతంగా బాధపడ్డారు. కాని తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ లో ఈసినిమా స్ట్రీమ్ అవుతుండడం.. అందులో ఈ మూవీకి విపరీతంగా.. రెస్పాన్స్ వస్తుండడంతో.. అందరూ ఖుషీ అవుతున్నారు. రికార్డు లెవల్ వ్యూవ్ అవర్స్ రికార్డవుతుండడంతో.. అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో.. కొంత మంది నెటిజెన్స్ రాజమౌళి కి అనుకూలంగా కామెంట్చేస్తున్నారు. రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దక్కిందంటూ.. కోట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..