- Telugu News Photo Gallery Cinema photos Tollywood Biggest Hit Movies list in worldwide Records with only content based Telugu Biggest Hits
Small Movie Biggest Hits: 2022లో కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించిన సినిమాలు ఇవే.. కాంతార సహా ఆ మూవీస్..
పవర్ ఆఫ్ కంటెంట్.. ఈ పదం ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పదం ఇది. వినిపించేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. హీరో ఎవరో తెలియకపోయినా.. దర్శకుడి గురించి క్లారిటీ లేకపోయినా.. సినిమాలు మాత్రం కేవలం కంటెంట్‌తోనే రప్ఫాడిస్తున్నాయి.
Updated on: Nov 04, 2022 | 7:58 PM

పవర్ ఆఫ్ కంటెంట్.. ఈ పదం ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పదం ఇది. వినిపించేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. హీరో ఎవరో తెలియకపోయినా.. దర్శకుడి గురించి క్లారిటీ లేకపోయినా.. సినిమాలు మాత్రం కేవలం కంటెంట్‌తోనే రప్ఫాడిస్తున్నాయి.

తాజాగా కాంతార ఇదే నిరూపించింది. మరి ఈ సినిమాతో పాటు 2022లో కంటెంట్‌తోనే వందల కోట్లు వసూలు చేసిన సినిమాలేంటో చూద్దాం..! కాంతార.. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది.కేవలం 18 కోట్ల బడ్జెట్‌తో కన్నడలో మాత్రమే రూపొందిన ఈ చిత్రం..

ఆ తర్వాత హిందీ, తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలోనే 100 కోట్లకు పైగా వసూలు చేసి.. కేజియఫ్ 2, జేమ్స్ సరసన చేరింది. హిందీ, తెలుగులోనూ 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది కాంతార.

కాంతార తెలుగు వర్షన్ ఇప్పటికే 25 కోట్ల షేర్ వసూలు చేసింది.. హిందీలోనూ 50 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. కన్నడలో తప్ప రిషబ్ శెట్టి మిగిలిన ఇండస్ట్రీల్లో తెలియకపోయినా.. కేవలం కంటెంట్‌తోనే కాంతార రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది.

కార్తికేయ 2 కూడా ప్యూర్ కంటెంట్‌తోనే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ సంచలనం రేపింది.

2022లో కేవలం కంటెంట్‌తోనే రప్ఫాడించిన మరో సినిమా ది కాశ్మీరీ ఫైల్స్. స్టార్స్ ఎవరూ లేకపోయినా.. కేవలం కథలో ఉన్న పవర్ ఈ సినిమాకు 270 కోట్లు తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాలకు 50 కోట్లు కూడా రాని దశలో.. కాశ్మీరీ పండిట్స్ మారణహోమం నేపథ్యంలో వచ్చిన కాశ్మీరీ ఫైల్స్ బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది.

అలాగే ధనుష్ తిరు, శివకార్తికేయన్ కాలేజ్ డాన్ లాంటి సినిమాలు ప్రమోషన్ లేకపోయినా.. కేవలం కంటెంట్ కారణంగానే బ్లాక్‌బస్టర్ అయ్యాయి.
