- Telugu News Photo Gallery Cinema photos Janhvi kapoor interesting comments on sridevi's biopic Telugu cinema news
Janhvi Kapoor: శ్రీదేవి బయోపిక్ చేయనంటున్న జాన్వీ కపూర్.. కారణం ఏంటంటే..? జాన్వీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. బాలీవుడ్ తనదైన స్టైల్ వేరు.
Updated on: Nov 04, 2022 | 6:43 PM

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్. కెరీర్ తొలి నాళ్ల నుంచి అమ్మ అడుగు జాడల్లోనే నడుస్తున్న జాన్వీ..

కమర్షియల్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవటం కన్నా.. నటిగా పేరు తెచ్చుకోవటం మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇలా ప్రతీ విషయంలోనూ తల్లినే ఫాలో అవుతున్న జాన్వీ..

ఆమె బయోపిక్ చేసేందుకు మాత్రం నో అంటున్నారు.మిలి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నా జాన్వీ కపూర్ వరుస ప్రెస్‌మీట్‌లతో హల్‌చల్ చేస్తున్నారు.

గతంలో బాలీవుడ్ మీడియాతో మాత్రమే ఇంటరాక్ట్ అయిన ఈ బ్యూటీ.. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవల్‌లో ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో ఇంట్రస్టింగ్ క్వశ్చన్స్‌ను ఫేస్ చేస్తున్నారు జాన్వీ.

ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలే చేస్తుండటంతో శ్రీదేవి బయోపిక్‌కు సంబంధించిన ప్రశ్న జాన్వీకి ఎదురైంది. గ్లామర్ క్వీన్‌గా ఇండియన్ స్క్రీన్ రూల్ చేసిన అతిలోక సుందరి బయోపిక్ చేస్తే అందులో మీరు టైటిల్ రోల్ ప్లే చేస్తారా అంటూ జాన్వీని ప్రశ్నించింది మీడియా.

నటిగా ఏ ఎంత సక్సెస్ అయినా అమ్మ బయోపిక్ మాత్రం చేయని క్లారిటీ ఇచ్చేశారు జాన్వీ కపూర్. అమ్మ గురించి మాట్లాడితేనే ఎమోషనల్ అయి ఏడ్చేసే జాన్వీ ఆమె పాత్రలో నటించటం అయ్యే పని కాదని క్లారిటీ ఇచ్చేశారు.

అంత శక్తి తనకు లేదంటూ బయోపిక్ ప్రపోజల్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.ప్రస్తుతానికి శ్రీదేవి బయోపిక్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా ఫ్యూచర్‌లో బయోపిక్ తెరకెక్కిస్తామంటూ ఇప్పటికే ఎనౌన్స్ చేశారు బోనీ కపూర్.

మరి ఆ మూవీలో టైటిల్ రోల్‌లో ఎవరు నటిస్తారు? అతిలోక సుందరిగా తెర మీద కనిపించబోయే ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Janhvi Kapoor




