- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone new glamorous Photos goes attractive in social media Telugu actors photos
Deepika Padukone: పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోతున్న దీపిక పదుకొనే.. అలంటి విషయాల్లో తగ్గేదే లే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల మేఘన్ మార్క్లే పోడ్‌కాస్ట్‌లో కనిపించింది. ఈ పోడ్‌కాస్ట్ వివిధ అంశాలను కవర్ చేసింది. అయితే ఒక ప్రత్యేక విభాగం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది దీపిక..
Updated on: Nov 04, 2022 | 6:09 PM

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే సామెత తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీపిక పదుకొనేకు ఇది పక్కాగా సరిపోతుంది. పెళ్లి పెళ్లే.. గ్లామర్ గ్లామరే అంటున్నారు ఈమె. పెళ్లైతే నాకేంటి.. నా షో నేను చేస్తానంటున్నారు దీపిక.

ఇంకా మాట్లాడితే బికినీకి తగ్గేదే లేదంటున్నారు ఈ బ్యూటీ. దీపిక హాట్ షోనే బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఓ హీరోయిన్ పెళ్లికి ముందు ఎంత రెచ్చిపోయినా.. ఎంతగా గ్లామర్ షో చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

కానీ అదే పెళ్లైన తర్వాత కూడా అదే రేంజ్‌లో హాట్ షో చేస్తే మాత్రం కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే విషయంలోనూ ఇదే జరుగుతుంది.

కామన్‌గానే నార్త్‌లో పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోతుంటారు హీరోయిన్లు. దీపిక కూడా ఇదే ఆనవాయితీ కంటిన్యూ చేస్తున్నారు.

మూడేళ్ళ కింద రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపిక పదుకొనే.. ఆ తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈమె కెరీర్‌పై పెళ్లి ఏ మాత్రం ప్రభావం చూపించలేదనే చెప్పాలి. వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు దీపిక.

అంతేకాదు మునపటి కంటే ఎక్కువగా ఇప్పుడే గ్లామర్ షో చేస్తూ కేక పెట్టిస్తున్నారు దీపిక. మొన్నామధ్య గెహ్రాయియాన్‌లో ముద్దుల వర్షం కురిపించిన దీపిక.. తాజాగా పఠాన్ టీజర్‌లో బికినీ షోతో మతులు చెడగొట్టేసారు.

షారుక్ హీరోగా నటిస్తున్న పఠాన్ టీజర్‌లో రెండే రెండు హైలైట్‌గా నిలిచాయి. ఒకటి కింగ్ ఖాన్ యాక్షన్ అవతార్ అయితే.. మరోటి దీపిక బికినీ షో. గత సినిమాల కంటే రెచ్చిపోయి ఇందులో అందాలు ఆరబోసారు దీపిక.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ Kలోనూ నటిస్తున్నారు ఈ భామ. అలాగే షారుక్ జవాన్ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నారు. సినిమా ఏదైనా.. అదిరిపోయే గ్లామర్ ఫీస్ట్ మాత్రం కామన్ అంటున్నారు దీపిక.

పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోతున్న దీపిక పదుకొనే అంటున్నారు నెటిజన్లు..




