Alia Bhatt: ఫస్ట్ హీరోతో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అలియా భట్.. మెటర్నిటీ బ్రేక్ ముగిసిన వెంటనే..
బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద అలియా భట్, వరుణ్ ధావన్‌లది ఇంట్రస్టింగ్ కాంబినేషన్. ఒకే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ జంట ఆ తరువాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.
బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద అలియా భట్, వరుణ్ ధావన్‌లది ఇంట్రస్టింగ్ కాంబినేషన్. ఒకే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ జంట ఆ తరువాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా ఈ జోడి ఓ హ్యాట్రిక్ రికార్డ్ సెట్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్, అలియా భట్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ జంట.. తరువాత ఎవరీ స్టైల్‌లో వాళ్లు దూసుకుపోతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మళ్లీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అంటున్నారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తరువాత మూడు సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, అలియా సిమిలర్ టైటిల్‌తో రెండు సినిమాలు చేశారు. హంప్టీ శర్మకి దుల్హనియా, బద్రినాథ్‌కి దుల్హనియా సినిమాల్లో అలియా, వరుణ్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ను అలరించింది. అందుకే ఈ కాంబోతో పాటు టైటిల్‌ను కూడా రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న అలియా భట్… నెక్ట్స్ వరుణ్ ధావన్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సూపర్ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ టైటిల్‌లో దుల్హనియా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దుల్హనియా టైటిల్‌తో వచ్చిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన శశాంక్ కేతన్ మూడో సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. మరీ ఈ మూవీతో అలియా, వరుణ్ కాంబో హ్యాట్రిక్ సెంటిమెంట్‌ను సెట్ చేస్తుందేమో చూడాలి.
అలియా భట్..
View this post on Instagram
(సతీష్, టీవీ9 తెలుగు)
మరిన్ని సినిమా వార్తలు చదవండి..