Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvasivo Rakshasivo Review: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఊర్వశివో రాక్షసివో..

ఊర్వశివో రాక్షసివో... తమిళ్‌లో ఆల్రెడీ ప్యార్‌ ప్రేమా కాదల్‌ పేరుతో రిలీజై విజయం సాధించింది. తెలుగులో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? చదివేయండి.

Urvasivo Rakshasivo Review: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఊర్వశివో రాక్షసివో..
Urvasivo Rakshasivo
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajitha Chanti|

Updated on: Nov 04, 2022 | 1:52 PM

Share

ఆచితూచి, తనకు పర్ఫెక్ట్ గా సరిపోయే కథలను సెలక్ట్ చేసుకుంటారనే పేరుంది అల్లు శిరీష్‌కి. లేటెస్ట్ గా ఆయన చేసిన సినిమా ఊర్వశివో రాక్షసివో. తమిళ్‌లో ఆల్రెడీ ప్యార్‌ ప్రేమా కాదల్‌ పేరుతో రిలీజై విజయం సాధించింది. తెలుగులో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? చదివేయండి.

సినిమా: ఊర్వశివో రాక్షసివో

నటీనటులు: అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఆమని, కేదార్‌ శంకర్‌ తదితరులు

ఇవి కూడా చదవండి

సమర్పణ: అల్లు అరవింద్‌

నిర్మాతలు: ధీరజ్‌ మొగిలినేని, విజయ్‌.ఎం.

సంగీతం: అచ్చు రాజామణి, అనూప్‌ రూబెన్స్

కెమెరా: తన్వీర్‌ మీర్‌

ఎడిటింగ్‌: కార్తిక శ్రీనివాస్‌ ఆర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: బాబు

దర్శకత్వం: రాకేష్‌ శశి

శ్రీకుమార్‌ (అల్లు శిరీష్‌) సాఫ్ట్ వేర్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని తండ్రి (కేదార్‌ శంకర్‌) కి చిన్న ఎలక్ట్రిక్‌ షాప్‌ ఉంటుంది. తల్లి (ఆమని) గృహిణి. శ్రీ పనిచేస్తున్న కాంపౌండ్‌లోనే పక్క కంపెనీలో పనిచేస్తుంటుంది సింధుజ (అను ఇమ్మాన్యుయేల్‌). ఆమెను దూరంగా చూసి ఇష్టం పెంచుకుంటాడు. కొన్నాళ్లకు శ్రీ పనిచేస్తున్న కంపెనీలోనే జాయిన్‌ అవుతుంది సింధుజ. ఫారిన్‌లో పెరిగిన అమ్మాయి కాబట్టి ప్రతి విషయాన్నీ సింపుల్‌గా తీసుకుంటుంది. కెరీర్‌, గోల్స్ అంటూ ఫోకస్‌గా ఉంటుంది. శ్రీతో ఆమె పరిచయం సాన్నిహిత్యానికి దారితీస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు శ్రీ. ఆ ప్రపోజల్‌ని అసలు ఏమాత్రం ఇష్టపడదు సింధు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది? మిడిల్‌ క్లాస్‌ శ్రీ ఫ్యామిలీ ఎలా స్పందించారు? హై సొసైటీలో ఉండే సింధు తండ్రి ఏమన్నారు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

శ్రీకుమార్‌గా అల్లు శిరీష్‌ పెర్ఫార్మెన్స్ నేచురల్‌గా ఉంది. సింధుజ కేరక్టర్‌కి అతికినట్టు సరిపోయారు అను ఇమ్మాన్యుయేల్‌. ఇద్దరి మధ్య ఆఫీస్‌ సన్నివేశాలు, ఇంట్లో సీన్లు బావున్నాయి. మిడిల్‌ క్లాస్‌ తల్లిదండ్రులుగా ఆమని, కేదార్‌ శంకర్‌ పక్కాగా సూట్‌ అయ్యారు. డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ రన్‌ చేసే కేరక్టర్‌కి పృథ్వి సూపర్‌ ఫిట్‌. సతీష్‌ కేరక్టర్‌లో వెన్నెలకిశోర్‌ నవ్వులు పండించారు. చిట్టి కేరక్టర్‌లో సునీల్‌ ఒదిగిపోయారు. మోడ్రన్‌ ట్రైలర్‌గా ఆయన డైలాగులు, సీన్స్ బావున్నాయి. వెన్నెలకిశోర్‌, సునీల్‌కి చాలా మంచి కేరక్టర్లు కుదిరాయి. సినిమాకు ప్లస్‌ పాయింట్స్ వారిద్దరి కేరక్టర్లు. పెళ్లిళ్ల పేరయ్యగా పోసాని పాత్ర కూడా మెప్పిస్తుంది.

ఆల్రెడీ తమిళ్‌లో విడుదలైన కథే అయినా, తెలుగుకు తగ్గట్టు చిన్న చిన్న సెన్సిటివిటీస్‌ని చక్కగా డీల్‌ చేశారు డైరక్టర్‌. సన్నివేశాల్లో అక్కడక్కడా చమ్మక్కులు చొప్పించారు. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం బావున్నాయి. కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ, సరదా సరదాగా సాగే సంభాషణలతో ఆడియన్స్ ని ఎంటర్‌టైన్‌ చేశారు. సందర్భోచితంగా వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావున్నాయి.

నేటి సొసైటీలో అక్కడక్కడా వినిపించే విషయాల మీద ఫోకస్‌ చేస్తూ చేసిన సినిమా ఊర్వశివో రాక్షసివో. తప్పకుండా యువతకు కనెక్ట్ అవుతుంది. సరదాగా చూడొచ్చు. ఊర్వశివో రాక్షసివో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. – డా. చల్లా భాగ్యలక్ష్మి