Rajeev Sen: భర్త వేధిస్తున్నాడంటూ ఇంటర్వ్యూలో నటి ఎమోషనల్.. లై డిటెక్టర్ టెస్ట్ కావాలంటున్న రాజీవ్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 04, 2022 | 9:05 AM

చారు.. తన భర్త తనను వేధించాడని.. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని వాపోయింది. అంతేకాకుండా తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఇతర మహిళలతో

Rajeev Sen: భర్త వేధిస్తున్నాడంటూ ఇంటర్వ్యూలో నటి ఎమోషనల్.. లై డిటెక్టర్ టెస్ట్ కావాలంటున్న రాజీవ్..
Rajeev Sen

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ తమ్ముడు రాజీవ్ సేన్ తనను వేధించాడని… ఆ కారణంగానే విడాకులు తీసుకున్నట్లు అతడి మాజీ భార్య సీరియల్ నటి చారు అపోసా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ఈ జంట.. నెలరోజుల్లోనే మళ్లీ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చారు.. తన భర్త తనను వేధించాడని.. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసించాడని వాపోయింది. అంతేకాకుండా తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఇతర మహిళలతో రాజీవ్ అక్రమసంబంధం కొనసాగించాడని.. అందుకే అతనితో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చారు తెలిపింది. తాజాగా ఆమె ఆరోపణలను తోసిపుచ్చాడు రాజీవ్. ఆమె మాటలలో ఎలాంటి వాస్తవం లేదని.. తను ఉమెన్ కార్డ్ వాడుకుంటుందని అన్నారు.

హిందుస్తాన్ టైమ్స్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ మాట్లాడుతూ.. ” ఆమె ఉమెన్ కార్డు వాడుకోవాలని భావిస్తుంది. ఒక వ్యక్తిగా ఆమె పట్ల నాకున్న గౌరవం పూర్తిగా కోల్పోయింది. ఆమె మనసు.. మైండ్ పూర్తిగా పోయిందని అర్థమవుతుంది. నేను తనను హింసించానన్నందుకు ఒక్క సాక్ష్యం కూడా లేదు. నాపై అసత్య ఆరోపణలు చేస్తుంది. నా కుటుంబం మొత్తం ఆమెను ప్రేమస్తూనే ఉంది. ఆమెకు ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారు. అయినా తను ఇలాంటి అవమానకరమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇందుకు ఆమెను నేనెప్పటికీ క్షమించను. ఆమె టీవీ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది. ఈ విషయం ఆమె తల్లివల్లే బయటపడింది.. మళ్లీ నాపైనే నిందలు వేస్తుంది. మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. లై డిటెక్టర్ పరీక్ష ఉంటే నేను సంతోషించేవాడిని. నేను అందుకు సిద్దంగా ఉన్నాను.

ఇవి కూడా చదవండి

లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఎవరు ఏర్పాటు చేయరని.. తాను చెప్పే ప్రతి మాటను విశ్వసిస్తారని భావిస్తుంది. నేను మనిషిని నాకు కోపం వస్తుంది. ఇలా కోపం రావాలని రెచ్చగొట్టే వ్యక్తులు చాలా ప్రమాదకరం. ఆమె స్వార్థపూరితంగా తనను తాను రక్షించుకోవడానికి నా బిడ్డను ఓ కవచంలా వాడుకుంటుంది. నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నచ్చట్లేదు. ప్రతి దానికీ ఆమె మీడియా ముందుకు రాకపోతే పరిస్థితులు మరోలా ఉండేవి.అయినా ఇంత జరిగాక ఊరుకునే ప్రసక్తే లేదు. ఆమెతో నేను ఉండలేను. పదే పదే ఆమె నామీద నిందలు వేసే మనిషితో నేను జీవితం కొనసాగించలేను ” అంటూ చెప్పుకొచ్చాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu