Bigg Boss 6: బిగ్ బాస్‌కు వెళ్లి రేవంత్ ఇంత నెగిటివ్ అయ్యాడు ఏంటి..? మీరేమనుకుంటున్నారు
రేవంత్ భయ్యా నీ లెవల్ ఏంటి..? ఇండియన్ ఐడాల్ విన్నర్, మెస్మరైజ్ చేసే వాయిస్, జాతీయ స్థాయిలో సత్తా చాటిన సింగర్.. కానీ ఏంటి ఈ కోపం.. మాట్లాడే విధానం, ప్రవర్తన.. మరీ ఇలానా..?
బిగ్ బాస్ సీజన్ 6 ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బలవంతంగా 4 రోజులు చూడటానికి ట్రై చేసినప్పటికీ కనెక్ట్ అవ్వట్లేదు అన్నది ఆడియెన్స్ నుంచి వస్తున్న వెర్షన్. ఈసారి ఆర్టిస్టుల సెలక్షన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. చాలామంది ఫేక్ అని.. పక్కాగా గేమ్ ప్లాన్ చేసుకుని ఇంట్లోకి వెళ్లారో తొలి వారంలోనే అర్థం అయ్యింది. అసలు రియల్ క్యారెక్టర్‌ను ఎవ్వరూ బహిర్గతం చేయడం లేదు. అందరూ మాస్కులు పెట్టుకుని ఆడేశారు. బిగ్ బాస్‌తో పాటు హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కొందరు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆటలోకి రాలేదు. కొద్దో గొప్పో కంటెంట్ ఇస్తుందని.. ఆ గలాటా గీతును నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఆమె గేమ్ ఏంటో.. ఆ ఆడే విధానం ఏంటో.. కొన్నిసార్లు జుగుప్స కలుగుతుంది. సంచాలక్‌గా ఉండి గేమ్‌ని ఆడుతుంది. బుర్రతో ఆడతా అంటూ లొల్లి లొల్లి చేస్తుంది. చేసే పనులు, మాట్లాడే విధానం ఏంటో ఆమె వేరే ప్లానెట్ నుంచి ఇక్కడికి వచ్చిందా అనిపిస్తుంది.
ఇక బిగ్ బాస్ ఇంట్లో ఒరిజినల్ క్యారెక్టర్‌తో ఉన్నది ఎవరు అంటే రేవంత్ అనే చెప్పాలి. అయితే కానీ రేవంత్ మరీ ఇలా బీహేవ్ చేస్తాడా..? అతనిది ఇలాంటి మైండ్ సెట్టా అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఒకటే దూకుడు, మాటలు తూలడం, వెక్కిరించడం, కోపాలు, తాపాలు.. ఇలా రేవంత్ తన స్థాయి నుంచి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడని నెటిజన్స్ వాపోతున్నారు. తాము అభిమానించిన, అడ్మైర్ చేసిన సింగర్ ఇతనేనా అని నివ్వెరపోతున్నారు. ఇండియన్ ఐడాల్ విన్నర్, అద్భతమైన పాటలు పాడిన వ్యక్తి.. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అయిన రేవంత్.. నిజంగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లకుండా ఉంటేనే బాగుండేది అన్నది అతని ఫ్యాన్స్ వాదన. అయినప్పటికీ.. ఓట్లు వేసి.. అతడిని ఆటలో నిలబెడుతూనే ఉన్నారు.
మాటలు పడలేకే చంటి సైడ్ అయిపోయాడా..?
బిగ్ బాస్ ఇల్లు అంటేనే.. మాటల యుద్ధం. కంటెస్టెంట్ల మధ్య మంటపెట్టి.. ఆ వచ్చే కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందిస్తారు. కానీ కొందరు అక్కడ ఇమడలేరు. అందుకు ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సీజన్ కంటెస్టెంట్ చంటి. చంటి చాలా సెటిల్డ్. తన లా పాయింట్లు మాట్లాడటం తెల్సు. మంచి కామెడీ కూడా చేయగలడు. కానీ అక్కడ పరిస్థితులు తనకు అనుకూలించలేదు. అయినదానికి, కానీదానికి గొడవపడటం తనకు నచ్చలేదు. మాటలు తీసుకోకలేక.. తన ఆటను చాలించి.. త్వరగా బయటకు వచ్చేశాడు. సో.. బిగ్ బాస్ ఆఫర్ వస్తే.. ఆర్టిస్టులు ఒకటికి, రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. కొందరికీ ఫేమ్ రావొచ్చు.. మరికొందరికీ అప్పటికే ఉన్న పొవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..