Naga Vardhini: తాజా ప్రియుడితో కలిసి మాజీ లవర్‌పై హత్యాయత్నం.. రిమాండ్‌కు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి

గతంలో ఒకరిని ప్రేమించిన సీరియల్ నటి.. ఇప్పుడు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో అగ్గి రాజుకుంది. ఈ క్రమంలో జరిగిన గొడవలు.. పతాక స్థాయికి వెళ్లాయి.

Naga Vardhini: తాజా ప్రియుడితో కలిసి మాజీ లవర్‌పై హత్యాయత్నం.. రిమాండ్‌కు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి
Artist Naga Vardhini Case Update
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 03, 2022 | 11:36 AM

రియల్‌ లైఫ్‌లో ట్విస్టులు టీవీ సీరియల్స్‌ను మించి పోతున్నాయి. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడి పెద్ద క్రైమ్‌లో ఇరుక్కుంది.. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ, సినిమాలు, సీరియల్స్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. సీరియల్స్‌లో పరిచయమైన నాగవర్ధినితో సూర్యనారాయణ కొన్నేళ్లు సహజీవనం చేశాడు. వీరు కృష్ణానగర్‌లోని ఓ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్లు.  మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. తాజాగా నాగవర్ధిని మరో సీరియల్‌ నటుడు శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో ఉంది. వీళ్లు కూడా సహజీవనం చేస్తున్నారు.

మధ్యలో మాజీ ప్రియుడు ఎంటరవ్వడంతో..మేటర్‌ సీరియస్‌ అయ్యింది.. పథకం ప్రకారం నాగవర్దిని, శ్రీనివాస్‌ రెడ్డి కలిసి.. సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోశారు. తీవ్రగాయాలతో సూర్యనారాయణ ఆస్పత్రిలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. బుధవారం ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా సూర్యనారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి ఇద్దరూ ఫ్రెండ్స్ అని తెలిసింది. సూర్యనారాయణే శ్రీనివాస్‌ రెడ్డికి నాగవర్థినిని పరిచియం చేశాడట. ఆ తర్వాత ట్రాక్ ట్రయాంగిల్ అయ్యింది. అది కాస్తా మర్డర్ స్కెచ్ వరకూ దారితీసింది.  గతంలోనే నాగవర్దినికి పెళ్లి అయినప్పటికీ.. భర్త నుంచి దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..