Charu Asopa: భర్త వేధింపులపై మరోసారి సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్.. మోసం చేశాడంటూ ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న చారు అసోపా..
ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది చారు అపోసా తన భర్త రాజీవ్ తనను మోసం చేశాడని.. ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని.. అతని వల్ల తన కెరీర్ నాశనమైందంటూ చెప్పుకొచ్చింది
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీరియల్ నటి చారు అసోపాను రాజీవ్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన సంవత్సరానికే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. అయితే తమ కూతురి భవిష్యత్తు కోసం మళ్లీ తాము కలిసి ఉండాలనుకుంటున్నామంటూ తమ విడాకులను రద్ధు చేసుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. తాజాగా మరోసారి తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భర్త పెట్టిన వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది చారు అపోసా. తన భర్త రాజీవ్ తనను మోసం చేశాడని.. ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని.. అతని వల్ల తన కెరీర్ నాశనమైందంటూ చెప్పుకొచ్చింది.
చారు మాట్లాడుతూ.. కొన్ని నెలలు బికనీర్ లో ఉన్న తర్వాత ఇటీవలే ముంభై తిరిగి వచ్చాను. నేను ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో ఎక్కువగా ఇక్కడే ఉన్నాను. నా భర్త ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. అతను నాకు ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పాడు. నేను వాటిని నిజమని నమ్మాను. తను నన్ను మానసికంగా వేధించాడు. ఎంతో కృంగిపోయాను. మా మధ్య ఎన్నోసార్లు గొడవలు అయ్యాయి. ఆ సమయంలో నాకు దూరంగా వెళ్లిపోయాడు. నా నంబర్ బ్లాక్ చేసేవాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను. నేను వర్క్ చేసే చోట కోస్టార్స్ నాకు దూరంగా ఉండాలంటూ వారిని బెదిరించేవాడు. నా పని విషయంలో జోక్యం చేసుకునేవాడు. దీంతో నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలకు షో నుంచి నన్ను తోలగించారు. అతని వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది. దీంతో నేను విడాకులు తీసుకున్నాను. కానీ పాప కోసం మళ్లీ కలవాలి అనుకున్నాము. కానీ రాజీవ్ తన ప్రవర్తనను మార్చుకోలేదు. అందుకే మళ్లీ విడాకులు తీసుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.
2019లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు ఏడాదిన్నరలోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరికి జియానా అనే పాప ఉంది. ప్రస్తుతం వీరి కూతురికి 11 నెలలు. ఇటీవల తమ విడాకులను రద్దు చేసినట్లుగా ప్రకటించిన ఈ జంట.. మళ్ళీ విడిపోతున్నామని తెలిపారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.