Jahnvi Kapoor: త్వరలోనే తెలుగులో నటించే అవకాశం ఉందంటున్న జాన్వీ.. ఆ సినిమా కోసం ముందే హింట్ ఇచ్చేసిందా ?..

జాన్వీ మాట్లాడుతూ.. తనకు సౌత్ సినిమాలు చేయాలని ఉందని.. త్వరలోనే నటించే అవకాశం ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. అంతేకాకుండా.. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని తెలిపింది.

Jahnvi Kapoor: త్వరలోనే తెలుగులో నటించే అవకాశం ఉందంటున్న జాన్వీ.. ఆ సినిమా కోసం ముందే హింట్ ఇచ్చేసిందా ?..
Jahnvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2022 | 7:07 AM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోన్న చిత్రం మిలి. డైరెక్టర్ మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ.. తనకు సౌత్ సినిమాలు చేయాలని ఉందని.. త్వరలోనే నటించే అవకాశం ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. అంతేకాకుండా.. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని తెలిపింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ డైరెక్టర్‌గారు స్టోరి చెప్పినప్పుడు మిలి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మనసున్న నిర్మాత అని అంటుంటారు. ఈ సినిమా సమయంలోనూ అది నిజమని ప్రూవ్ చేశారు. సెట్స్‌కైతే చాలా తక్కువ సార్లు వచ్చారంతే. తన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటిగా 15-16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే చిన్న విషయం కాదు.. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. అయితే ఇలాంటి పాత్రలో నటించటం వల్ల మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి, నాన్నకి ఎంత ప్రేమను అందించారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా సౌత్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల తనకు ఎన్టీఆర్‏తో నటించాలని ఉందని.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది. ఇక కొద్ది రోజులుగా తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్టు‏లో జాన్వీ కథానాయికగా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జాన్వీ కూడా నటించాలని ఉందని చెప్పడంతో నిజంగానే ఎన్టీఆర్30 ప్రాజెక్ట్‏లో ఈ ముద్దుగుమ్మ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.