Devi Sri Prasad: వెంటనే క్షమపణలు చెప్పాల్సిందే.. దేవి శ్రీ ప్రసాద్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్..
కాంట్రవర్శీకి మరోసారి కేంద్ర బిందువుగా మారారు స్పెషల్ సాంగ్స్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. ఈ మధ్యే ఓ.. పిల్ల పేరుతో అల్బమ్ రిలీజ్ చేశాడు దేవి. ఆ సాంగ్‌లో పవిత్ర మంత్రాన్ని అపహస్యం చేశాడంటూ బీజేపీ భగ్గుమంది. హిట్టు కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా..?
సినిమా పాటల్లో.. ప్రైవేట్ అల్బమ్స్‌లో వచ్చే కొన్ని పదాలు వివాదాస్పదం అవుతుండటం అనేది ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్ మొదలుకొని భారీ బడ్జెట్ సినిమాల వరకు చాలా పాటలు కాంట్రవర్శీకి కేరాఫ్‌గా నిలిచాయి. లేటెస్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. కాంట్రవర్శీకి మరోసారి కేంద్ర బిందువుగా మారారు స్పెషల్ సాంగ్స్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. ఈ మధ్యే ఓ.. పిల్ల పేరుతో అల్బమ్ రిలీజ్ చేశాడు దేవి. ఆ సాంగ్‌లో పవిత్ర మంత్రాన్ని అపహస్యం చేశాడంటూ బీజేపీ భగ్గుమంది. హిట్టు కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా..? సంగీత దర్శకుడిపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ‘ఇదేం హరే రామ’ అంటూ.. కరాటే కళ్యాణీ ఆయనపై.. ఆయన పాటపై వివాదం చెలరేగేలా చేసిన క్రమంలో… ఆ వివాదంపై బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేవుడిపై దేవీ తీరును తప్పుబడుతూ.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.. కూడా దేవీ శ్రీ ప్రసాద్ పై తీరుపై మండిపడ్డారు.
ఓ పారి అనే పాప్ ఆల్బమ్ విడుదలైంది. విదేశీ మోడల్స్‌తో కలిసి దేవి శ్రీ ప్రసాద్ తెగ హంగామా చేస్తూ ఈ ఆల్బమ్ తయారు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ దేశాల్లో చిత్రీకరించిన ఈ ఆల్బమ్ కోసం బడ్జెట్ కూడా బాగానే కేటాయించారు. సాంగ్ కి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. తీరా విడుదల తర్వాత చిక్కుల్లో పడ్డారు. పాటలో వాడిన కొన్ని పదాలపై వివాదం రాజుకుంది. దేవీ శ్రీ ఓ పారి ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని వాడారని, ఓ ఐటెం సాంగ్‌లో ఇలాంటి పదాలు వాడటం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. దేవి శ్రీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారాయన. దేవీ ప్రసాద్ తాజాగా రిలీజ్ చేసిన.. హరేరామ సాంగ్‌లో హిందూ దేవుడైన శ్రీకృష్ణుడిని అవమానించారన్నారు విష్ణు వర్దన్ రెడ్డి. వెంటనే ఆ పాటలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో పాటే హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు దేవీని.. సారీ చెప్పాలన్నారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోట్లాది మంది జపించే హరే రామ.. హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్‌కి పాడటమేంటని ప్రశ్నించారు మరో బీజేపీ నేత పార్థసారథి. బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాంగ్ షూట్ చేయడమేంటని నిలదీశారు. దేవి శ్రీ ప్రసాద్ జాతీయ స్థాయిలో పాటలు కంపోజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ అయిన టీ సిరీస్ కోసం దేవి ఈ పాటను రూపొందించారు. ఓ పిల్ల అని పేరుతో ఉన్న ఈ పాటను మూడు వారాల కిందట యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కూడా డ్యాన్స్ చేసిన ఈ పాటకు 2 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. హిందీలో ఉన్న ఈ పాటలో అభ్యంతరక పదాలున్నాయని బీజేపీ, హిందూ సంఘాలు అభ్యంతరం వక్తం చేస్తున్నాయి. వివాదాలు దేవి శ్రీకి కొత్తేం కాదు. గతంలోనూ ఐటం సాంగ్‌లను డివోషనల్ సాంగ్‌లు ఒక్కటేనని కాంట్రవర్శీకి ఆజ్యం పోశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.