Santosh Shoban: పాన్ ఇండియా స్టార్‌కు వీరాభిమాని.. ఆయనకు సినిమా చూపించాలనేది డ్రీమ్.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం లైక్ షేర్ & సబ్స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంతోష్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమాని లైక్ చేయడానికి కారణం ? అడగ్గా.. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ గారు అంటే ఇష్టం. ఆయన కథతో ఎక్ మినీ కథ చేశాను. ఆయనతో ఒక బాండింగ్ వుంది. ఆయన టైమింగ్ నాకు తెలుసు. ఎక్ మినీ కథ తర్వాతే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని అనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపొయింది. కథ చెప్పిన నెల రోజుల తర్వాతే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందం గా వుంది. మనస్పూర్తిగా నవ్వుకొని నవ్విస్తూ చేసిన సినిమా లైక్ షేర్ & సబ్స్క్రైబ్. అలాగే నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇది.
ప్రభాస్ గారు మీ ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తుంటారు.. కానీ మొన్న ఆయనతో డైరెక్టర్ యాక్సెస్ లేదని చెప్పారు ? అని అడగ్గా.. “ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఎదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ నేను గర్వపడి, నమ్మిన సినిమా. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించడం నా డ్రీమ్” అంటూ చెప్పుకొచ్చారు సంతోష్. నేను సినిమా పరిశ్రమకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ నాకు ఎదురైన వారంతా నాన్న (దర్శకుడు శోభన్) గురించి ఒక మంచి మాట చెప్పారు. నవ్వుతూ పలకరించారు. ఇది నా అదృష్టం. నేను మరింత కష్టపడి చేస్తాను. నాన్న వెళ్ళిపోయి 14 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ నా చుట్టూ వున్నవాళ్ళంతా ఆయన గురించి చెబుతూ నవ్వుతూ పలకరిస్తున్నారంటే వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్టే అని అన్నారు.