Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi: సర్దార్‌ సూపర్‌ హిట్.. డైరెక్టర్‌కు కాస్ట్లీకార్‌ గిఫ్ట్‌.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

ఈ సినిమాలో కార్తీ.. చంద్రబోస్‌ అలియాస్‌ సర్దార్‌, ఆయన తనయుడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాశ్‌ పాత్రల్లో నటించి మెప్పించాడు. కార్తీ కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు.

Karthi: సర్దార్‌ సూపర్‌ హిట్.. డైరెక్టర్‌కు కాస్ట్లీకార్‌ గిఫ్ట్‌.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!
Karthi
Basha Shek
|

Updated on: Nov 03, 2022 | 9:40 PM

Share

కార్తీ హీరోగా, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్‌. రజిషా విజయన్‌ సెకెండ్‌ హీరోయిన్‌గా నటించగా, సీనియర్‌ నటి లైలా ఓ కీలక పాత్రలో కనిపించింది. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. వాటర్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 21న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీ.. చంద్రబోస్‌ అలియాస్‌ సర్దార్‌, ఆయన తనయుడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాశ్‌ పాత్రల్లో నటించి మెప్పించాడు. కార్తీ కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో చిత్రబృందమంతా సంతోషంలో మునిగితేలుతోంది. ఈనేపథ్యంలో నిర్మాత డైరెక్టర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. సర్దార్‌ నిర్మాత ప్రిన్స్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌. లక్ష్మణ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. హీరో కార్తీ చేతుల మీదుగా దాన్ని పీఎస్‌ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర రూ.2కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా కారు బహుమతిగా అందుకోవడం పట్ల దర్శకుడు పిఎస్ మిత్రన్ సంతోషం వ్యక్తం చేస్తూ నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సర్దార్ సీక్వెల్ కు కథను సిద్ధం చేసే పనులు పనిలో పడ్డాడీ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. సర్దార్‌కి పని చేసిన బృందమే రెండో పార్ట్‌లోనూ భాగం కానుందని స్పష్టత ఇచ్చారు. ‘ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే’ అంటూ సర్దార్‌ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా ఎంపికవ్వడాన్ని ప్రచార చిత్రంలో చూపించారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 4 సినిమాల్లో నటించాడు కార్తీ. సర్దార్‌తో పాటు కమల్‌ హాసన్‌ విక్రమ్‌, విరుమాన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాల్లో నటించాడీ కోలీవుడ్ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో