AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani: బిజినెస్‌ మెన్‌తో ఏడడుగులు నడవనున్న యాపిల్‌ బ్యూటీ.. పెళ్లి ముహూర్తం, వెన్యూ ఫిక్స్‌!

ముంబైకు చెందిన వ్యాపారి సోహాల్ కతూరియాతో హన్సిక ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకే కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వీరు ఇప్పుడు జీవితాన్ని కూడా పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

Hansika Motwani: బిజినెస్‌ మెన్‌తో ఏడడుగులు నడవనున్న యాపిల్‌ బ్యూటీ.. పెళ్లి ముహూర్తం, వెన్యూ ఫిక్స్‌!
Hansika Motwani
Basha Shek
|

Updated on: Nov 01, 2022 | 11:38 AM

Share

ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన హన్సిక దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆతర్వాత తమిళ్‌ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. గతంతో పోల్చితే ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపిస్తోన్న ఈ యాపిల్‌ బ్యూటీ లవ్‌, రిలేషన్‌షిప్‌ వ్యవహారాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబుతో హన్సిక పెళ్లి పీటలు ఎక్కుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవి పుకార్లకే పరిమితమైపోయాయి. ఆ ఆర్వాత ముంబైకు చెందిన వ్యాపారి సోహాల్ కతూరియాతో హన్సిక ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకే కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వీరు ఇప్పుడు జీవితంలో కూడా పార్ట్‌నర్లుగా మారనున్నారని తెలుస్తోంది. ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో డిసెంబర్ 4వ తేదీన హన్సిక, సోహాల్‌ పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌లో వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

కాగా డిసెంబర్ 2వ తేదీ నుంచే హన్సిక ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు మొదలు కానున్నాయట. మెహెందీ, సంగీత్‌ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. ఇక 4వ తేదీన అతిరథ మహారథుల సమక్షంలో ఈ జోడీ ఏడడుగులు నడవనున్నారట. అయితే ఈ పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులకే ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం.. ఇక జైపూర్ ప్యాలెస్‌లో గెస్ట్‌ల కోసం గదులు, సూట్‌లు ముందుగానే బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే ప్యాలెస్‌లోనే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం జరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..