AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: కోలీవుడ్‌ యాక్షన్‌ హీరోతో ప్రేమయాణం.. త్వరలోనే పెళ్లి! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

వితేజ, అల్లరి నరేష్‌, శివబాలాజీ నటించిన శంభో శివ శంభో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. వినికిడి సమస్యలతో పాటు మాటలు రాని ఈ అందాల తార ఈ సినిమాలో మాస్‌ మహరాజా చెల్లెలిగా నటించి మెప్పించింది.

Vishal: కోలీవుడ్‌ యాక్షన్‌ హీరోతో ప్రేమయాణం.. త్వరలోనే పెళ్లి! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
Vishal, Abhinaya
Basha Shek
|

Updated on: Oct 31, 2022 | 10:09 AM

Share

విశాల్‌.. సినిమాలు, పాలిటిక్స్‌తోనే కాదు నిత్యం పెళ్లి పుకార్లతోనూ వార్తల్లో ఉంటాడీ కోలీవుడ్‌ యాక్షన్‌ హీరో. గతంలో ఎన్నోసార్లు ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ముందు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారం అంటూ ప్రచారం జోరుగా సాగింది. పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే పెళ్లిపీటలెక్కకుండానే అది క్యాన్సిల్‌ అయిపోయింది. ఆతర్వాత పలు సార్లు విశాల్‌ పెళ్లిపై పుకార్లు వచ్చాయి. అయితే అవి వదంతులుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్‌ అభినయతో విశాల్‌ ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. రవితేజ, అల్లరి నరేష్‌, శివబాలాజీ నటించిన శంభో శివ శంభో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. వినికిడి సమస్యలతో పాటు మాటలు రాని ఈ అందాల తార ఈ సినిమాలో మాస్‌ మహరాజా చెల్లెలిగా నటించి మెప్పించింది. అలాగే నేనింతే, కింగ్‌, దమ్ము, డమరుకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ధ్రువ, రాజుగారి గది, ఇటీవల వచ్చిన సీతారామం చిత్రాల్లోనూ గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.

కాగా ప్రస్తుతం విశాల్‌ హీరోగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనీ చిత్రంలో లీడ్‌రోల్‌ పోషిస్తోంది అభినయం. ఈనేపథ్యంలో విశాల్‌తో ప్రేమ, పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంపై విశాల్‌ ఇప్పటివరకు స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం రియాక్ట్‌ అయ్యింది. ‘మార్క్‌ ఆంటోనీ సినిమాలో విశాల్‌కు భార్యగా నటిస్తున్నాను. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా?’ అంటూ ఈ పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశాల్‌, అభినయల ప్రేమ, పెళ్లి అనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడినట్టు అయింది. ఇక విశాల్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను లాఠీ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు తుప్పరివాలన్‌ 2 (అభిమన్యుడు సీక్వెల్‌), మార్క్ ఆంటోని సినిమాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే