అట్లుంటది మరి కోహ్లీ క్రేజ్‌ అంటే.. ఇసుక తిన్నెలపై విరాట్ బొమ్మ గీసిన పాక్‌ ఫ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

తాజాగా బలూచిస్థాన్‌కు కు చెందిన విరాట్‌ వీరాభిమాని ఆర్‌ఏ గద్దాని కోహ్లీపై తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. 'లవ్ ఫ్రమ్ ఆర్ ఎ గడ్డాని' అంటూ ఇసుకపై మన రన్‌ మెషిన్‌ భారీ చిత్రాన్ని గీశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అట్లుంటది మరి కోహ్లీ క్రేజ్‌ అంటే.. ఇసుక తిన్నెలపై విరాట్ బొమ్మ గీసిన పాక్‌ ఫ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2022 | 12:17 PM

టీమిండియా మాజీ కెప్టెన్, మన రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులోనూ దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ బోలెడు మంది కింగ్ కోహ్లీని ఇష్టపడతారు. ఇటీవల భారత్ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత ఓ పాక్‌ సింగర్‌ కోహ్లీని కలిసిన సంగతి తెలిసిందే. అతనికి కోహ్లీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన టీషర్ట్‌ను ఇచ్చి తన ఫ్యాన్స్‌ అంటే ఎంత మమకారమో మరోసారి చాటుకున్నాడు. అంతుకు ముందు కూడా పలువురు పాక్‌ అభిమానులు పలు సందర్భాల్లో విరాట్ పోస్టర్లు, ఫ్లెక్సీలు పట్టుకుంటూ సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. తాజాగా బలూచిస్థాన్‌కు కు చెందిన విరాట్‌ వీరాభిమాని ఆర్‌ఏ గద్దాని కోహ్లీపై తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ‘లవ్ ఫ్రమ్ ఆర్ ఎ గడ్డాని’ అంటూ ఇసుకపై మన రన్‌ మెషిన్‌ భారీ చిత్రాన్ని గీశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గద్దాని ఆవిష్కరించిన ఈ అద్భుతమైన స్కెచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఫాజిలా బలోచ్‌ అనే ప్రముఖ సోషల్‌ యాక్టివిస్ట్‌ సైతం గద్దాని రూపొందించిన విరాట్‌ కోహ్లీ చిత్రాన్ని షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కానీ .. బలూచిస్థాన్‌ లాంటి ప్రాంతంలో కూడా వీరాభిమానులు ఉండటంపై టీమిండియా ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

కాగాఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా.. పాకిస్థాన్‌ను ఓడించింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును విరాట్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగి అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. కాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో మ్యాచ్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే జింబాబ్వే చేతిలో ఓటమితో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్‌ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. తారకరాముడి స్పందనేంటి?.. ‘రజనీతో రామ్’.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌..