AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: గంగమ్మకు మొక్కులు చెల్లిస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా స్టార్..

కేవలం హీరోయిన్‌గానే కాదు కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించి సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఓ స్టార్‌ క్రికెటర్‌తో ప్రేమలో పడింది. పెద్దల ఆశీర్వాదంతో మనసిచ్చిన వాడిని మనువాడింది.

Actress: గంగమ్మకు మొక్కులు చెల్లిస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా స్టార్..
Actress
Basha Shek
|

Updated on: Oct 30, 2022 | 9:31 AM

Share

గంగానది తీరాన మొక్కులు చెల్లిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన ఈమె ఓ స్టార్‌ హీరోయిన్‌. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. షారుఖ్‌, సల్మాన్‌, ఆమిర్‌ఖాన్‌ వంటి స్టార్ల సరసన సందడి చేసింది. కేవలం హీరోయిన్‌గానే కాదు కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించి సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఓ స్టార్‌ క్రికెటర్‌తో ప్రేమలో పడింది. పెద్దల ఆశీర్వాదంతో మనసిచ్చిన వాడిని మనువాడింది. ఆతర్వాత ఒక ఆడబిడ్డకు అమ్మగా మారింది. మాతృత్వం కారణంగా కొన్ని రోజుల పాట సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఓ స్పోర్ట్స్‌ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు కూతురి ఆలనాపాలన చూసుకుంటూ ఇన్‌స్పిరేషన్‌ వుమన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార మరెవరో కాదు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ. ఓ సినిమా పనుల నిమిత్తం కోల్‌కతా వెళ్లిన అనుష్క తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోల్లో అనుష్క వెంట ఆమె కూతురు వామిక కూడా ఉంది. ఈ సందర్భంగా గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంది అనుష్క. అదేవిధంగా తన గారాలపట్టితో కలిసి కోల్‌కతా వీధుల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ఝులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చక్డా ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలావరకు పూర్తైంది. ఇటీవల ఈ సినిమా నుంచి బయటికొచ్చిన అనుష్క స్టిల్స్‌ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..