Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: తెనాలిలో ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం.. తయారీ, ప్రత్యేకతలివే

పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

Puneeth Rajkumar: తెనాలిలో ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం.. తయారీ, ప్రత్యేకతలివే
Puneeth Rajkumar
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2022 | 9:59 AM

దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈలోకాన్ని విడిచిపోయి నేటికి (అక్టోబర్‌ 29) ఏడాది గడిచిపోయింది. అయితే అప్పు లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అయితే పిన్న వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని విడిచి పోయారు. గతేడాది ఇదే రోజ అప్పు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పునీత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా పునీత్‌కు కన్నడతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగునాట ఆయనకు అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా త్వరలోనే బెంగళూరులో తరలించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక అప్పు మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నాను. అలాగే అప్పు నటించిన గంధడ గుడి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో మొక్కలను కూడా ప్రదానం చేయనున్నారు. ఇక పునీత్‌ కుటుంబ సభ్యులు కంఠీరవ స్టేడియంలోని అప్పు సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..