Jr NTR: ‘డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది’.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల జపాన్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Jr NTR: 'డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది'.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ntr, Ram Charan
Follow us

|

Updated on: Oct 29, 2022 | 10:18 AM

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రస్తుతం జపాన్ లో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, జక్కన్న, ఎన్టీఆర్ జపాన్‏లో సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు అక్కడ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తారక్, చరణ్ లను చూసి జపనీస్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. వీరిద్దరికి విభిన్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలోనే పాటలకు జపనీస్ అందంగా స్టెప్పులేస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల జపాన్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తారక్ మాట్లాడుతూ.. ” మేము భారతీయులం ఎప్పుడూ డ్యాన్స్ గురించి ఫిర్యాదు చేయము. డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది. అందుకే భారతీయులు డ్యాన్స్ అంటే ఇష్టపడకుండా ఉండలేరు. డ్యాన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలంటే.. ముందు డ్యాన్స్ ను ప్రేమించడం నేర్చుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభుదేవా.. అతడిని ఇప్పటికీ ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల అమెరికాలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవల ఈ మూవీ 50వ సాటర్న్ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్.. బెస్ట్ డైరెక్టర్ సహా పలు విభాగాల్లో నామినేటే చేయబడింది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..