Kantara: కాంతార చిత్రానికి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై థియేటర్లలో ఆ పాట వినిపించదు..
కేరళ ఆదివాసీల భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై ఇప్పటికే కాపీరైట్ ఫిర్యాదు చేశారు. ఇందులోని వరాహ రూపం సాంగ్ కాపీ చేశారంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. కేరళ ఆదివాసీల భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై ఇప్పటికే కాపీరైట్ ఫిర్యాదు చేశారు. ఇందులోని వరాహ రూపం సాంగ్ కాపీ చేశారంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ పాటను కాపీ చేశారంటూ కోజికోడ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోడికోడ్ కోర్టు.. థియేటర్లలో వరాహ రూపం సాంగ్ ప్లే చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఈ పాటను ప్లే చేయకూడదని ఆదేశించింది.
గతంలో తాము తెరకెక్కించిన నవరస సాంగ్ కాపీ చేసి కాంతార చిత్రంలో ఉపయోగించారని.. ఈ చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తైక్కుడం బ్రిడ్జ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపీరైట్ ఉల్లంఘన చేశారని..దీంతో థియేటర్లలో ఈ సాంగ్ ప్లే చేయకూడదంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ టీమ్ అనుమతి లేకుండా కాంతార చిత్రంలో వరాహ రూపం సాంగ్ ప్లే చేయకూడదని.. నిర్మాత, దర్శకుడు.. సంగీత దర్శకుడి.. అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. మరిన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ కు నిషేధం విధిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది కోజికోడ్ కోర్టు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి.. స్వియ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం కన్నడలో కాకుండా ఉత్తరాదిలోనూ భారీ వసూల్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన అతి పెద్ద విజయాలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది కాంతార సినిమా. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుందని.. దైవం ఆవహించిన సమయంలో రిషబ్ నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.