Puneeth Rajkumar: అభిమానుల గుండెల్లో చిరంజీవిగా అప్పు.. పునీత్ ఈ లోకాన్ని విడిచి నేటికి ఏడాది..
పునీత్ ఫిట్‌గా ఉంటాడు. జిమ్‌లో ఎక్కువగా ఉంటాడు. ఫిట్‌నెస్, హెల్త్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలాంటి వ్యక్తికి గుండెపోటు అంటే చాలామంది నమ్మలేదు. కానీ కొద్ది గంటల్లోనే పునీత్ మరణ వార్త బయటకు వచ్చింది.
అది అక్టోబర్ 29, 2021. శివరాజ్‌కుమార్ నటించిన బజరంగీ 2 సినిమా విడుదలైంది. దీంతో రాజ్ కుటుంబంలో సంబరాల వాతావరణం నెలకొంది. బజరంగీ 2 టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ శివరాజ్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ ట్వీట్ చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత షాకింగ్ న్యూస్ వినిపించింది. పునీత్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. పునీత్ ఫిట్‌గా ఉంటాడు. జిమ్‌లో ఎక్కువగా ఉంటాడు. ఫిట్‌నెస్, హెల్త్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలాంటి వ్యక్తికి గుండెపోటు అంటే చాలామంది నమ్మలేదు. కానీ కొద్ది గంటల్లోనే పునీత్ మరణ వార్త బయటకు వచ్చింది. అంతే పునీత్ అభిమానుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ విషాద ఘటన జరిగి నేటికి (అక్టోబర్ 29) ఏడాది పూర్తయింది.
అన్నదాన కార్యక్రమాలు..
కాగా పునీత్ రాజ్‌కుమార్ సమాధి కంఠీరవ స్టూడియోలో ఉంది. ఉదయం 9 గంటలకు పునీత్ కుటుంబ సభ్యులందరూ సమాధి వద్దకు వెళ్లి పవర్‌స్టార్‌కు నివాళులు అర్పించనున్నారు. వీరితో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు కూడా పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. కాగా సినిమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు పునీత్. ఈ నేపథ్యంలో అప్పు వర్ధంతిని పురస్కరించుకుని కంఠీరవ స్టూడియోతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రక్తదానం, అన్నదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 28న పునీత్ నటించిన సినిమా గంధ గుడి విడుదలైంది. దీంతో అప్పును మరోసారి సిల్వర్‌స్ర్కీన్‌పై చూసే అవకాశం దక్కింది. కొంతమంది గంధ గుడి సినిమాలో అప్పును చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. టాక్, కలెక్షన్లతో సంబంధం లేకుండా చాలా చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి. కాగా షిమోగాలో సినిమా చూసేందుకు వచ్చిన వారికి బిర్యానీ పంచారు. నగరంలోని వీరభద్ర థియేటర్ సమీపంలో అభిమానుల కోసం 60 కిలోల చికెన్ బిర్యానీ వడ్డించారు.
కాగా కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ కి.. నవంబర్ 1న ‘కర్ణాటక రత్న’ బిరుదుతో సత్కరించనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..