Rana Daggubati: ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన రానా సతీమణి.. మ్యారీడ్‌ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నానంటూ..

రానా ఫ్యామిలీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. రానా భార్య ప్రెగ్నెంట్‌ అన్నదే ఆ వార్తల సారాంశం. కొన్ని వెబ్‌సైట్లు కూడా మిహికా గర్భంతో ఉందని కథనాలు ప్రచురించాయి.

Rana Daggubati: ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన రానా సతీమణి.. మ్యారీడ్‌ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నానంటూ..
Rana Daggubati, Mihika
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 2:11 PM

టాలీవుడ్‌ ది మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్‌ జోడీ కూడా ఒకటి. 2020 ఆగస్టు 8న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. కాగా పెళ్లికి ముందు కొద్ది రోజుల పాటు రానా-మిహీకాలు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్ల తర్వాత కూడా ఈ లవ్లీ కపుల్‌ వార్తల్లో నిలుస్తోంది. పండగలు, పర్వదినాల సందర్భాల్లో జంటగా కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే రానా ఫ్యామిలీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. రానా భార్య ప్రెగ్నెంట్‌ అన్నదే ఆ వార్తల సారాంశం. కొన్ని వెబ్‌సైట్లు కూడా మిహికా గర్భంతో ఉందన్న వార్తలు ప్రచురించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది రానా సతీమణి మిహికా.

సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటే మిహీకా తన ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలాగే రానాతో దిగిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈనేపథ్యంలో తాజాగా మిహికా షేర్‌చేసిన ఫొటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెంట్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై ఓ అభిమాని మిహికాను ‘మీరు ప్రెగ్నెంటా’? అని అడిగాడు. దీనికి ‘నేను ఇంకా హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త హెల్దీగా మారాను’ అంటూ మిహికా సమాధానం ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వదంతులకు చెక్‌ పడినట్లయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది విరాటపర్వం సినిమాలో కామ్రేడ్‌ రవన్న పాత్రలో ఆకట్టుకున్నాడు రానా. ప్రస్తుతం ఆయన బాబాయి వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందుతున్న ఈ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే అప్డేట్‌ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..