Drinking water: దాహం వేయకపోయినా నీటిని తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి. ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. అందాన్ని కాపాడుకోవడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, ముఖం కాంతివంతంగా ఉండేందుకు నీరు బాగా తాగాలని వైద్యులు సూచిస్తారు. కానీ కొంతమందికి ఎలా, ఎప్పుడు, ఎంత నీరు తాగాలి అనే విషయాలు సరిగా తెలియవు. ఒక రోజుకు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యం, అందం కోసం నీటిని సరైన స్థాయిలో తాగాలి. ఒక వేళ దాహం వేయకపోయినా నీరు తాగడం మంచిదేనా? అంటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆరోగ్యం, అందం కోసం నీరు తాగడం సరైనదే. అయితే అది సక్రమంగా తీసుకుంటేనే. లేకపోతే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి. ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతను కలిగిస్తుంది. ఫలితంగా కడుపు, గుండెల్లో మంట, అసిడిటీ మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
దాహం లేప్పుడు నీరు తాగవద్దు..
దాహం లేకుండా నీరు తాగడం హానికరం. ఎందుకంటే మన శరీరానికి నీరు అవసరమైనప్పుడు, దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. దాహం లేకుండా నీరు తాగితే మెదడును గందరగోళానికి గురి చేస్తుంది. అలాగే దాహం వేయనప్పుడు నీరు జీర్ణం కావడం చాలా కష్టం. కాబట్టి దాహం వేసినప్పుడే నీరు తాగడానికి ప్రయత్నించండి. శరీరంలో అధిక నీటి స్థాయుల కారణంగా హైపోనట్రేమియా సమస్య రావచ్చు. రక్తంలో సోడియం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది మీ మెదడును ప్రభావితం చేసే పరిస్థితి. అదే సమయంలో, ఇది రక్తపోటు సమస్యలను కలిగిస్తుంది. నిలబడి నీళ్లు తాగడం నిలబడి నీళ్లు తాగితే చాలా త్వరగా శరీరంలోకి నీరు చేరుతుంది. అటువంటి పరిస్థితిలో, వేగంగా నీటి ప్రవాహం కారణంగా, జీర్ణవ్యవస్థ దానిని గ్రహించలేకపోతుంది. దీని వల్ల కడుపులో మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. మన లాలాజలంలో ఆల్కలీన్ ఉంటుంది, ఇది కడుపులోని యాసిడ్‌ను మోడరేట్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, నీరు ఎక్కువగా తాగడం వల్ల, లాలాజలం నీటిలో కరగదు. తద్వారా కడుపులో యాసిడ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నీటిని ఎలా తాగాలంటే?
దాహం లేకుండా నీరు ఎక్కువగా తాగొద్దు. ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీరు తాగడానికి ప్రయత్నించండి. మరీ చల్లని నీరు, మరీ వేడినీరు కాకుండాగోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి.రాగి, వెండి పాత్రల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది. అవి యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది నీటిని మరింత హెల్దీగా చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి
అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.