Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health: పద్మవ్యూహంలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మానసిక ఆరోగ్యం.. కోవిడ్‌ తర్వాత తీవ్ర స్థాయికి చేరిన సమస్య

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు కొన్ని రకాల మానసిక రుగ్మతలతోబాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. అంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు మానసిక సమస్యను ఎదుర్కొంటుండగా..దాదాపు 8 లక్షల మంది  ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలింది.  

Mental Health: పద్మవ్యూహంలో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మానసిక ఆరోగ్యం.. కోవిడ్‌ తర్వాత తీవ్ర స్థాయికి చేరిన సమస్య
Mental Health
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2022 | 1:15 PM

ప్రపంచంలోని ఎవరైనా సరే.. తనకు వచ్చిన ఎటువంటి వ్యాధినైనా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ.. మానసిక సమస్యను మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే.. అదొక ఘోరమైన వ్యాధిగా భావించేవారు అధికంగా ఉన్నారు.. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవును తెలంగాణ రాష్ట్రం సహా ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్య తో బాధపడే బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత భూమి మీద నివసించే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భయం, ఒంటరితనం, ఒత్తిడి, యాంగ్జైటీ, సంపాదన కోల్పోవడం వంటివన్నీడిప్రెషన్, ఆందోళన , PTSD వంటి సమస్యలను కలిగిస్తాయి. వెంటనే వీటిని గుర్తించి బాధితులకు తగిన చికిత్స, సాయం అందించకపోతే.. శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మానసిక బాధితుల సంఖ్య అత్యధికంగా పేద దేశాల్లోనే ఉంది. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య మరింత పెరిగిందని.. కనుక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక దేశాలు నిర్ణయించాయి. ప్రపంచ జనాభా 800 కోట్ల చెరువులో ఉన్న వేళ.. వీరిలో దాదాపు 100 కోట్ల మందికి పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. పద్నాలుగేళ్ల వయసు నుంచే మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు సంఖ్య అధికంగా ఉందని ఏటా దాదాపు 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే ఈ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాల సంఖ్య అతి తక్కువగా ఉంది. దేశ ఆరోగ్య బడ్జెట్‌లో రెండు శాతానికి మించి నిధులు మానసిక విభాగంపై కేటాయింపులు చేయడం లేదు. దీంతో రానున్న రోజుల్లో కుంగుబాటుతో బాధపడేవారు సంఖ్య అధికంగా ఉంటుందని.. అప్పుడు అత్యధికంగా వ్యయం చేయాల్సిన  పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మానసిక సమస్య అంటే ఏమిటంటే.. మనిషి ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు కనిపిస్తే.. వెంటనే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. వీలైనంత త్వరగా బాధిత వ్యక్తిని మానసిక సమస్య నుంచి బయటపడే మార్గం కనుగొనాలి. లేదంటే .. ఆత్మహత్య దిశగా అతని అడుగులు పడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు కొన్ని రకాల మానసిక రుగ్మతలతోబాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. అంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు మానసిక సమస్యను ఎదుర్కొంటుండగా..దాదాపు 8 లక్షల మంది  ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలింది.

మానసిక సమస్యకు ప్రపంచ దేశాల్లో ఒక్క అమెరికా మాత్రమే అత్యధికంగా సంవత్సరానికి $300 బిలియన్లు ఖర్చు చేస్తుంది. మిగిలిన దేశాలు ఇక నుంచి ఈ విభాగంలో చికిత్స కోసం నిధులను కేటాయించాలని కోరుతుంది. ఇంకా చెప్పాలంటే.. రానున్న 20 ఏళ్లలో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువ మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతుంది.

ఉచిత సహాయం ,మద్దతు అందించండి

మానసిక అనారోగ్యంతో ఉన్న ఎవరైనా సరైన మానసిక ఆరోగ్య వంతుల మద్దతుతో చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇది మందులు, మానసిక చికిత్స లేదా సహాయక బృందాల రూపంలో ఉండవచ్చు. అదే సమయంలో మానసిక ఆందోళన గురించి తన వారితో పంచుకునే విధంగా బాధితులు ఆలోచించాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..