AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: చిన్నారులను వేధించే దగ్గు, జలుబు.. ఈ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా ట్రీట్ మెంట్..

వర్షాకాలం ముగిసి, చలికాలం ప్రారంభమవుతోంది. ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల..

Winter Health: చిన్నారులను వేధించే దగ్గు, జలుబు.. ఈ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా ట్రీట్ మెంట్..
Children Health In Winter
Ganesh Mudavath
|

Updated on: Oct 27, 2022 | 12:41 PM

Share

వర్షాకాలం ముగిసి, చలికాలం ప్రారంభమవుతోంది. ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో పిల్లలు వ్యాధుల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం ఈజీగా ఎట్టాక్ చేస్తాయి. వారికి జలుబు, గొంతు నొప్పి, అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నారుల రోగ నిరోధక వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి. చిన్నారులకు దగ్గు, జలుబు చేసినప్పుడు తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. ఆస్పత్రులకు వెళ్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సమస్యలు సర్వ సాధారణం. వాటి బారి నుంచి రక్షించుకునేందుకు ఇంట్లోనే పలు చిట్కాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కానీ పరిస్థితి తీవ్రంగా మారితే మాత్రం వైద్యులను సంప్రదించడంలో అలసత్వం వహించవద్దు.

పసుపు పాలు: పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం. పాలల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలం. సాధారణ జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు పసుపు కలిపిన పాలు మంచి ఉపశమనం అందిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చిన్నారులకు పసుపు పాలు ఇవ్వాలి. పసుపు గొంతు నొప్పి, ముక్కు కారడాన్ని తగ్గిస్తుంది. పాలల్లో ఉండే కాల్షియం పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది.

వేడి వేడి సూప్: పిల్లలు దగ్గు, జలుబుతో ఉన్నప్పుడు నిరంతరం దగ్గులు, తుమ్ములు వేధిస్తుంటాయి. కాబట్టి వారిని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. తరచుగా నీటిని తీసుకోవడం వల్ల గొంతు మంట తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌ను తొలగించడం ద్వారా సాధారణ జలుబును నివారించవచ్చు. వేడి వేడి సూప్, పండ్ల రసాలు శరీరం కోల్పోయిన శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

తేనె: నిరంతర దగ్గు, తుమ్ముల కారణంగా గొంతు పొడిబారుతుంది. దీనిని మళ్లీ యాక్టీవ్ గా చేసేందుకు తేనె చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మందులు ఇవ్వడానికి బదులుగా రోజుకు రెండు లేదా మూడు సార్లు తేనె ఇవ్వాలి. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ఇవ్వవచ్చు.

ఆవిరి: జలుబు కారణంగా మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తిరిగి తెరుచుకునేలా చేసేందుకు ఆవిరి చక్కగా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఆవిరి పట్టేలా చేయాలి. వేడి నీటిలో స్నాం చేసినా మంచి ఉపశమనం పొందవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.