NTR District: టీచర్లకే క్లాస్ పీకిన జగ్గయ్యపేట పోలీసులు.. పెద్ద రీజనే ఉందండోయ్..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Oct 26, 2022 | 4:21 PM

పిల్లలు ట్రాక్ తప్పారు. స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గంజాయి కూడా సేవిస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. టీచర్లకు క్లాస్ తీసుకున్నారు.

NTR District: టీచర్లకే క్లాస్ పీకిన జగ్గయ్యపేట పోలీసులు.. పెద్ద రీజనే ఉందండోయ్..
Jaggaiahpet Police

పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే… ఆ బాధ్యత కచ్చితంగా తల్లిదండ్రులదే. అదే పిల్లలు.. స్కూల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే మాత్రం… అది టీచర్ల ఖాతాలోకే వెళ్తుంది. అప్పుడు ఎంట్రీ ఇవ్వాల్సింది మాత్రం సమాజ రక్షకులుగా ఉన్న పోలీసులే. ఎగ్జాట్లీ… జగ్గయ్యపేట పోలీసులు కూడా అదే చేశారు. సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులను కాకుండా… వారికి విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లకు క్లాస్‌ తీసుకున్నారు. జివిజె జెడ్పీ హైస్కూల్లో టీచర్ల అవతారమెత్తిన పోలీసులు… టీచర్లందరినీ పిల్లల బెంచుల్లోకి షిఫ్ట్‌ చేశారు. పిల్లలకు మంచిచెడ్డా నేర్పకుండా ఏం చేస్తున్నారంటూ… కాసేపు క్లాస్‌ తీసుకున్నారు.

ఇక, ఇంతకీ మేటర్‌ ఏంటంటే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బాయ్స్ హై స్కూల్ లో ప్రభుత్వ ఆస్తుల ధ్వసం కేసులో పూర్వాపరాలు తెలుసుకున్న పోలీసులు… ఈవిధమైన చర్యలకు ఉపక్రమించారు. స్కూల్ లో బెంచీలు విరగ్గొట్టి, కిటికీల చువ్వలు వంచి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతూ నానా బీభత్సం చేసింది విద్యార్థులేనని గుర్తించారు పోలీసులు. స్కూల్లో ఉన్న బుక్స్ సైతం చోరీచేసి… విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్టు ఐడెంటిఫై చేశారు. ఇదంతా సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు… ఏడుగురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో 6గురు మైనర్లను జూవైనల్ జస్టిస్ ముందు హాజరు పరిచారు.

ఆ తతంగం అంతా పూర్తయ్యాక స్కూలుకొచ్చిన ఖాకీలు టీచర్ల అవతారం ఎత్తారు. జగ్గయ్యపేట సీఐ నాగ మురళి, ఎస్సై రామారావు ఫ్యాకల్టీగా మారిపోయి… టీచర్లకు క్లాస్‌ తీసుకున్నారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే డ్యూటీ టీచర్లదని… మంచి బుద్దులు నేర్పాలని సూచించారు. అయినా వినకపోతే.. పోలీసులకు ఇన్‌ఫామ్‌ చేయాలన్నారు. హద్దుమీరి అల్లరి చేసే విద్యార్థులను గుర్తించాలని సూచించిన పోలీసులు… నేరప్రవృతి అలవర్చుకోకుండా విద్యార్థులను కంట్రోల్‌ పెట్టాలని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. విద్యార్థులకూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu