Kakinada: అంతు చిక్కని వింత సమస్యతో బాధపడుతున్న విద్యార్థినులు.. వైద్య శిబిరాలు ఏర్పాటు.. డాక్టర్స్ కు సవాల్ విసురుతోన్న వ్యాధి
గత ఐదు రోజుల క్రితం ఊపిరాడక, స్పృహ తప్పి 9,10వ తరగతి చెందిన ఆరుగురు విద్యార్థానులకు ఇదే సమస్య పునరావతం కావడంతో ఉపాధ్యాయులు మళ్లీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఈ విషయం టీవీ9కి సమాచారం రావడంతో విద్యార్థుల అస్వస్థత పై కథనం ప్రచారం చేశారు.
అది ఒక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. కాని అక్కడ ఒక అంతు చిక్కని వింత సమస్యతో ఆ విద్యార్థినులు బాధపడుతున్నారు. ఉన్నంటుండి ఊపిరాడక ఇబ్బంది పడుతూ.. స్పృహ తప్పి పడిపోతున్నారు. ఆ విద్యార్థినులు ఎందుకిలా పడిపోతున్నారు అనేది డాక్టర్లకు సైతం అంతు చిక్కని వింత ప్రశ్నగా మిగిలిపోయింది. గతంలో కాకినాడ కేంద్రియ విద్యాలయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది..? కారణాలు ఏంటి..?
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాదాపుగా 1500 పైగా విద్యార్థులు. అందులో సగానికి పైగా బాలికలు ఉండడంతో రెండు సెక్షన్లుగా విభజించి బాలురిని, బాలికలను సపరేట్ చేశారు. స్కూల్లో పరిసరాలన్నీ బాగానే ఉన్నప్పటికీ గత మూడు నెలలుగా అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక పడిపోతు ఉంటున్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించి పరిస్థితి నార్మల్ గా ఉండటంతో వెంటనే రికవరీ అవి ఇంటికి వస్తున్నారు. కానీ గత ఐదు రోజుల క్రితం ఊపిరాడక, స్పృహ తప్పి 9,10వ తరగతి చెందిన ఆరుగురు విద్యార్థానులకు ఇదే సమస్య పునరావతం కావడంతో ఉపాధ్యాయులు మళ్లీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఈ విషయం టీవీ9కి సమాచారం రావడంతో విద్యార్థుల అస్వస్థత పై కథనం ప్రచారం చేశారు. దీంతో విద్య, వైద్యాధికారులు స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక యు.కొత్తపల్లి పి హెచ్ సి కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అదే సమయంలో మళ్లీ సమస్య పునరావృత్తమై.. ఊపిరాడక విలువలాడుతుండడంతో 108లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఏడుగురు విద్యార్థులను తరలించారు.
అయితే వీరు ఉదయం వరకు ఊపిరాడక విలువలు ఆడుతున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు అసలు ఏమి జరిగిందో వైద్యులకు సైతం అంతుచిక్కలేదు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఎన్ని పరిక్షలు చేసిన అన్ని నార్మల్ గా ఉంది. మధ్యాహ్నం వరకు ఒక లెక్కా.. మధ్యాహ్నం తర్వాత మరో లెక్కగా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. మధ్యాహ్నం రోగులుగా వెళ్ళినవారు సాయంత్రం నవ్వులు పువ్వులు విరజిల్లితూ కనిపించారు విద్యార్థులు. అసలు ఏం జరిగింది వీళ్ళకి నిజంగానే అస్వస్థకు గురై ఊపిరాడక ఇబ్బంది పడ్డారా.. లేక వీరు సైకలాజికల్ గా ఒక భ్రమలో ఈ విధంగా ప్రవర్తించారనేది డాక్టర్లు సైతం అంతుచిక్కలేదు.
స్థానికులు అయితే 1997లో పూర్వ విద్యార్థులు ఇదే స్కూల్ లో ఇదేవిధంగా వ్యవహరించే వారని దెయ్యం , భూతం వంటివి ఏమైనా వీళ్ళకి ఆవరించి ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతుంది.. విద్యార్థులు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారులు స్కూల్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. స్కూల్ లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు ప్రత్యేక డాక్టర్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినా ఏటువంటి పురోగతి కనిపించలేదు. ఈ పరీక్షల్లో కొందరికి రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కానీ శ్వాస ఆడక ఇబ్బంది పడడం అనేది అంతుచిక్కడం లేదు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగా మరో ఇద్దరు విద్యార్థులు అదే పరిస్థితి పునరావృతంమై ఊపిరాడక ఇబ్బంది పడడంతో యు.కొత్తపల్లి పీహెచ్సీ సెంటర్ కి తరలించారు. ఈ విధంగా జరిగిన విద్యార్థులకు ఎన్ని వైద్య పరీక్షలు చేసిన రికవరీ కావడం లేదు కానీ.. పేపర్ , కవర్ నోటికి, ముక్కుకి పెట్టి ఉంచితే ఊపిరావడక ఇబ్బంది పడిన విద్యార్థులు వెంటనే కోలుకుంటున్నారు. దీంతో ఇది ఏ విధమైన వైద్యమో ఎవరికీ అర్థం కావడం లేదు.
స్కూల్ ఆవరణంలోనూ, క్లాస్ రూమ్ లోనూ ఆక్సిజన్ శాతం తక్కువ ఉండడం వలన ఈ విధంగా జరుగుతుందా.. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడం వలన ఈ విధంగా జరుగుతుందా.. లేక దెయ్యం భూతం వంటి మానసిక భయానికి విద్యార్థులు గురవుతున్నారా అనేది తెలియ రావడం లేదు. మరో పక్క స్కూల్ టీచర్స్ మాత్రం పొంతనలేని సమాధానం చెప్పడం పలు అనుమానాలు కలిగిస్తుంది. స్థానిక పాఠశాల మెంబర్.. కొంతమంది స్తానికులు ఇది కావాలనే విద్యార్థులతో ఇలా చేయించారని .. కుట్ర జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనల వెనుక నిజమెంటో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రెండు నెలల క్రితం కాకినాడలో కేంద్రీయ విద్యాలయంలో ఇటువంటి ఘటన జరగడం..మళ్ళీ ఈ స్కూల్ లో ఘటన రెండు సమస్యలు ఒకేలా ఉండడంతో దీనిపైన పెద్దగా స్పష్టత రాలేదు. ఈ రెండు సంఘటనలపై సంబంధిత ప్రభుత్వ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను తీలుసుకోవాలి. ప్రాణ నష్టం లేనప్పటికీ విద్యార్థులు ఈ విధంగా ఎందుకు గురవుతున్నారో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
Reporter: Satya, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..