Andhra Pradesh: ఆమెకు 33 అతనికి 22.. ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం.. భర్త అడ్డొస్తున్నాడని భావించి..
సోషల్ మీడియా ద్వారా ఎన్ని ఉపయోగాలున్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలూ ఉన్నాయని తెలిపే సంఘటన ఇది. అప్పటికే ఆమెకు పెళ్లయి ముగ్గురు పిల్లలున్నాయి. ఫేస్ బుక్ లో 22 ఏళ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం...
సోషల్ మీడియా ద్వారా ఎన్ని ఉపయోగాలున్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలూ ఉన్నాయని తెలిపే సంఘటన ఇది. అప్పటికే ఆమెకు పెళ్లయి ముగ్గురు పిల్లలున్నాయి. ఫేస్ బుక్ లో 22 ఏళ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. మద్యం మత్తులో నిద్రపోతున్న అతని మెడకు తీగ చుట్టి ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో వేసి దూరంగా పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ కరీముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి అతని భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కరీముల్లా హత్య జరిగిన తర్వాత అతని భార్య మాబ్బి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కరీముల్లా భార్యే హత్య చేసినట్లు గుర్తించారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఫోన్‌లోని వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరీముల్లా భార్య మాబీకి వంశీకుమార్‌రెడ్డి అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేస్తే అడ్డుండదని భావించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి మద్యం మత్తులో ఇంట్లో పడుకుని ఉన్న కరీముల్లా మెడకు తీగను బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి పొదల్లో విసిరేశారు.
అయితే నిందితురాలు మాబీకి అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. కాగా 22 ఏళ్ల వయసున్న వంశీకుమార్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం సాన్నిహత్యంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మాబీకి పెళ్లి అవడం, ముగ్గురు పిల్లలుండటంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అందుకు అతనిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. హత్యకు ముందు రోజు అహోబిలం వెళ్లి ఎలా హత్య చేయాలని, తర్వాత ఎలా ఉండాలన్న విషయాలపై ప్రణాళిక వేసుకున్నట్లు విచారణలో తేలింది. విచారణను తప్పుదోవ పట్టించేందుకు మాబ్బి భర్త మృతదేహంపై పడి రోదించడం, ఇతరులపై అనుమానాలున్నట్లు చెప్పింది. అయితే ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆళ్లగడ్డ పరిధిలోని ఏసునాథపురంలో నివాసముంటున్న కరీముల్లా కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో రెండు రోజుల క్రితం అతని భార్య మాబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు శనివారం విద్యుత్తు ఉపకేంద్రం వద్ద బైపాస్ రహదారి పక్కన అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగ్ లభించింది. సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సంచిని తెరిచి చూడగా.. అందులో మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని కరీముల్లా భార్య మాబీకి సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి తన భర్తదేనని గుర్తించింది. పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మాబీ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టగా తన భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..