AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT Phase-2 Selection List: ఏపీ ఆర్జీయూకేటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల.. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-2 సెలక్షన్‌ లిస్ట్‌ బుధవారం (అక్టోబర్‌ 26) విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు..

AP RGUKT Phase-2 Selection List: ఏపీ ఆర్జీయూకేటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల.. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఎప్పుడంటే..
AP RGUKT Phase-2 Selection List
Srilakshmi C
|

Updated on: Oct 27, 2022 | 9:34 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-2 సెలక్షన్‌ లిస్ట్‌ బుధవారం (అక్టోబర్‌ 26) విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 31న నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ వెల్లడించింది. ఫేజ్ 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెల్పింది.

ఇప్పటికే ఫేజ్‌-1 కౌన్సెలింగ్‌ (అక్టోబర్‌ 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు) పూర్తి కాగా ఆయా క్యాంపస్‌లలో సీట్లు పొందిన విద్యార్ధులకు అక్టోబర్‌ 17 నుంచి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం.. ఈ నాలుగు క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. ఐతే ఈ ఏడాది ఐఐఐటీల్లో ప్రవేశాలకు 44,208 మంది విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్ధులు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్