WhatsApp: అక్టోబర్ 25న వాట్సప్‌ సేవలు అందుకే నిలిచిపోయాయట.. వెల్లడించిన మెటా!

ప్రపంచవ్యాప్తంగా మంగళవారం (అక్టోబర్‌ 25) రెండు గంటలపాటు వాట్సాప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  వాట్సప్ హఠాత్తుగా ఆగిపోవడంతో మిలియన్ల కొద్ది యూజర్లు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు..

WhatsApp: అక్టోబర్ 25న వాట్సప్‌ సేవలు అందుకే నిలిచిపోయాయట.. వెల్లడించిన మెటా!
WhatsApp
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2022 | 9:35 AM

ప్రపంచవ్యాప్తంగా మంగళవారం (అక్టోబర్‌ 25) రెండు గంటలపాటు వాట్సాప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  వాట్సప్ హఠాత్తుగా ఆగిపోవడంతో మిలియన్ల కొద్ది యూజర్లు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. వాట్సప్‌ చాట్‌, గ్రూప్‌ చాట్‌, వీడియో కాల్స్‌ వంటి సేవల వల్ల బహుళ ప్రయోజనాలు పొందుతున్న క్రమంలో ఈ యాప్‌ ఉన్నట్టుండి ఆగిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అసలెందుకు నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్‌ సేవలు నిలిచిపోయాయనే విషయంపై మెటా తాజాగా వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపం (టెక్నికల్‌ ఎర్రర్‌) కారణంగా వాట్సప్‌ ఆగిపోయిందని తెల్పింది. ఐతే దీనిపై వాట్సప్‌-పేరెంట్ మెటా మరిన్ని వివరాలను అందించలేదు. యాదృచ్ఛికంగా గత ఏడాది అక్టోబర్‌ మాసంలోనే దాదాపు ఆరు ఏళ్ల పాటు మిలియన్ల మంది యూజర్లను తగ్గించిన మెటా.. సరిగ్గా అదే నెలలో వాట్సప్ సేవలకు అంతరాయం కలగడంతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

‘డేటా సెంటర్‌ల మధ్య నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను సమన్వయం చేసే రౌటర్‌లలో కాన్ఫిగరేషన్ మార్పుల కారణంగా సేవలకు అంతరాయం కలిగుంటుంది. ఈ సమస్య కారణంగానే నిన్న వాట్సప్‌ సేవలు ఆగిపోయి ఉండవచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద’ని ఇంజనీరింగ్ టీం ఓ బ్లాగులో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నిన్న వాట్సాప్ ఆగిపోవడంతో ఏం జరిగిందంటే..

మంగళవారం (అక్టోబరు 25న) మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాలకు వాట్సప్‌ ఆగిపోగా మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు తిరిగి సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు వాట్సప్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో 69 శాతం మంది యూజర్లు మెసేజ్‌లను పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, 21 శాతం మంది యూజర్లకు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు అవుట్‌టేజ్ ట్రాకర్, డౌన్‌డిటెక్టర్ చూపింది. ఇతర కారణాల వల్ల దాదాపు 9 శాతం మంది యూజర్లు యాప్‌ను వినియోగించలేకపోయినట్లు వెల్లడించింది. ఇక వాట్సప్‌ సిబ్లింగ్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌లకు మాత్రం ఎటువంటి అవాంతరాలు తలెత్తకపోవడం విశేషం.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.