భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి నల్లజాతీయుడు, మొదటి హిందువు, మొదటి భారతీయుడిగా రిషి సునాక్ రికార్డు సాధించారు. నిజానికి రిషి సునాక్ తాతలు పంజాబ్ వాసులు. రిషి భార్య అక్షతా మూర్తి కూడా భారతీయురాలే. ఆమె తండ్రి ఎన్ నారాయణ మూర్తి దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్త. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ స్థాపకుడు నారాయణమూర్తి కావడం విశేషం. కాగా సూర్యుడస్తమించని బ్రిటీష్ సాంమ్రాజ్య పాలనలో మగ్గిన భారతదేశం మూలల నుంచి ఒక భారతీయుడు అదే బ్రిటీష్ సామ్రాజ్యాధినేత కావడం ఒకింత భారతీయులు గర్వించదగ్గ విషయం. ఐతే రిషి సునాక్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత సంతతికి చెందిన లీడర్లు ప్రస్తుతం ఆయా దేశాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం..