Ravi Kiran |
Updated on: Oct 26, 2022 | 8:03 AM
టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆసీస్ విజయానికి కీలక పాత్ర వహించాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా.. రికార్డులు సృష్టించాడు. అవేంటో తెలుసుకుందాం.
శ్రీలంకపై మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో స్టోయినిస్ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా ఘనత సాధించడమే కాదు.. టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్స్ లిస్టులో చేరాడు.
టీ20 ప్రపంచకప్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. స్టోయినిస్‌తో పాటు 2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన స్టీఫెన్ మేబర్గ్ ఐర్లాండ్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
టీ20 వరల్డ్‌కప్, టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 2007లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ 12 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.