Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Police Jobs 2022: రేపట్నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు పార్ట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ రెండు సర్టిఫికెట్లు కీలకం

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు తాజా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్‌-2 దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి (అక్టోబర్ 27) ప్రారంభమవుతుంది. ఈ దశలో..

TS Police Jobs 2022: రేపట్నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు పార్ట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ రెండు సర్టిఫికెట్లు కీలకం
TSLPRB SI Constable Part II Online Application
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 26, 2022 | 11:22 AM

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు తాజా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్‌-2 దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి (అక్టోబర్ 27) ప్రారంభమవుతుంది. ఈ దశలో అభ్యర్ధులు ముందుగా అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవల్సి ఉంటుంది. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్ధులందరూ తదుపరి దశగా పలిచే ‘పార్ట్‌-2’గా పిలిచే ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసేందుకు అక్టోబ‌రు 27 నుంచి నవంబరు 10 వరకు అవకాశం ఇచ్చింది. అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. కాగా తెలంగాణ ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్ల కింద విడుదల చేసిన 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా వారిలో 2.69 లక్షల మంది అర్హత సాధించారు. తుది గడువు వరకు వేచి చూడకుండా ముందుగానే సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచిస్తోంది.

రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంతో స్థానికత అంశం కీలకంగా మారింది. ఈ మేరకు తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్‌ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలుండటంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగా పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు నాన్‌లోకల్‌ కోటాలో 5 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే క్యాస్ట్‌ (కుల ధ్రువీకరణపత్రాలు) సర్టిఫికెట్‌ కూడా కీలకమైనది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా జనరల్‌ కేటగిరీగా పరిగణించే అవకాశం ఉంది.

అప్‌లోడ్‌ చేయవల్సిన సర్టిఫికెట్లు ఇవే..

ఇవి కూడా చదవండి

1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నేటివ్‌ సర్టిఫికెట్‌, పుట్టినతేదీ నిర్ధారణకు పదో తరగతి మార్కుల షీటు, డిగ్రీ మార్కుల షీటు, ఇంటర్‌ మార్కుల షీటు, కుల సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, బీసీ అభ్యర్థులకు 2021 ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్‌, సర్వీస్‌ సర్టిఫికెట్‌, మాజీ సైనికోద్యోగులు/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ లేదా డిశ్ఛార్జి బుక్‌

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.