AP EAPCET 2022: మరికొన్ని గంటల్లో విడుదలకానున్న ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్-2022 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితలు

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్-2022 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితలు ఈ రోజు (అక్టోబర్‌ 26) విడుదలకానున్నాయి. ఫైనల్ రౌండ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్ధులు ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో సీట్‌ అలాట్‌మెంట్‌..

AP EAPCET 2022: మరికొన్ని గంటల్లో విడుదలకానున్న ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్-2022 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితలు
AP EAPCET 2022 Final Phase Seat Allotment results
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 26, 2022 | 9:41 AM

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్-2022 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితలు ఈ రోజు (అక్టోబర్‌ 26) విడుదలకానున్నాయి. ఫైనల్ రౌండ్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్ధులు ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితలను చెక్‌ చేసుకోవచ్చు. అధికారిక ప్రకటన ప్రకారం తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదలవ్వనున్నాయి. ఫలితాల ప్రకటన అనంతరం ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు అక్టోబర్‌ 26 నుంచి 31వ తేదీ వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవల్సిందిగా ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తెల్పింది.

ఏపీ ఎంసెట్-2022 సీట్ల కేటాయింపు ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ముందుగా ఏపీ ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్‌ చెయ్యాలి. హోమ్ పేజీలో కనిపించే ఏపీ ఎంసెట్-2022 సీట్ల కేటాయింపు ఫలితాల లింక్‌పై క్లిక్ చెయ్యాలి. అనంతరం లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి. సీటు కేటాయింపు రిజల్ట్స్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అనంతరం హార్డ్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.