SPMP Recruitment 2022: శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
కేంద్ర ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంజినీర్ గ్రేడ్ 1 (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి..
కేంద్ర ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్.. ఒప్పంద ప్రాతిపదికన 6 జూనియర్ ఇంజినీర్ గ్రేడ్ 1 (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో మూడేళ్ల ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు నవంబర్ 22, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.27,600ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Chief Mechanical Engineer, Shyamaprasad Mukherjee Port, Kolkata, Mechanical, Electrical Division, 8 Garden Reach Road, Kolkata-700043.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.