- Telugu News Photo Gallery Cinema photos Actress Poorna and Shanid Asif got married in Dubai. Wedding photos are going viral on internet
Actress Poorna Marriage Photos: నటి పూర్ణ పెళ్లి ఫొటోలు చూశారా? నెట్టింట వైరలవుతున్న పిక్స్..
తెలుగు ప్రేక్షకులకు నటి పూర్ణ సుపరిచితమే. మలయాళ నటి అయిన పూర్ణ అసలు పేరు షమా ఖాసిమ్. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని నటి పూర్ణల వివాహం సోమవారం దుబాయ్‌లో ఘనంగా జరిగింది..
Updated on: Oct 25, 2022 | 10:37 AM

తెలుగు ప్రేక్షకులకు నటి పూర్ణ సుపరిచితమే. మలయాళ నటి అయిన పూర్ణ అసలు పేరు షమా ఖాసిమ్.

దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీ, నటి పూర్ణల వివాహం సోమవారం దుబాయ్‌లో ఘనంగా జరిగింది.

అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి ఫొటోలను నటి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పూర్ణ, అలీ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ కేరళ కుట్టి 2004లో ‘మంజు పొలారు పెన్‌కుట్టీ’ అనే సినిమాతో మాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీహరి హీరోగా నటించిన ‘శ్రీమహాలక్ష్మి’ సినిమాతో తెలుగులో ఆరంగెట్రం చేశారు.

‘సీమటపాకాయ్’, ‘అవును’, ‘లడ్డూబాబు’, ‘నువ్వలా నేనిలా’, ‘అవును 2’, ‘శ్రీమంతుడు’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘పవర్ ప్లే’, ‘సుందరి’, ‘దృశ్యం 2’, ‘అఖండ’, ‘తీస్ మార్ ఖాన్’ చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం నాని హీరోగా నిటిస్తున్న దసరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. వ్రితం అనే మళయాల సినిమాలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు పలు రియాలిటీ షోలలో పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

గత కొంత కాలంగా నటి పూర్ణ పెళ్లిపై పలు వదంతులు వచ్చాయి. దీంతో ప్రస్తుతం పూర్ణ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




