AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Cheating Hat: స్టూడెంట్స్‌ క్రియేటివిటీ! పరీక్షల్లో కాపీలు కొట్టకుండా ఎలాంటి మాస్క్‌లు ధరించారో చూడండి..

సాధారణంగా పరీక్షలంటే విద్యార్ధులందరూ యమ స్ట్రిక్ట్‌గా కళ్లు పక్కకు తిప్పకుండా రాస్తారని అనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే. అసలే ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌.. అపై వారి క్రియేటివిటీకి టీచర్లు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. అదేంటంటే రాబోయే పరీక్షల్లో పక్కవాళ్ల పేపర్‌ కాపీ కొట్ట కుండా ఉండేందుకు..

Anti-Cheating Hat: స్టూడెంట్స్‌ క్రియేటివిటీ! పరీక్షల్లో కాపీలు కొట్టకుండా ఎలాంటి మాస్క్‌లు ధరించారో చూడండి..
‘Anti-cheating’ exam hats in the Philippines
Srilakshmi C
|

Updated on: Oct 25, 2022 | 11:37 AM

Share

సాధారణంగా పరీక్షలంటే విద్యార్ధులందరూ యమ స్ట్రిక్ట్‌గా కళ్లు పక్కకు తిప్పకుండా రాస్తారని అనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే. అసలే ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌.. అపై వారి క్రియేటివిటీకి టీచర్లు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. అదేంటంటే రాబోయే పరీక్షల్లో పక్కవాళ్ల పేపర్‌ కాపీ కొట్ట కుండా ఉండేందుకు ‘యాంటీ చీటింగ్‌ హ్యాట్‌’ స్వయంగా తయారు చేసుకుని పరీక్షలకు హాజరుకావల్సిందిగా కాలేజ్‌లో హుకూం జారీ చేశారు. దీంతో ఒక్కొక్కరు బాహుబలి కిరీటం, మిక్కి మౌస్‌, దుబాయ్‌ షేక్‌ల తలపాగాలు, అండర్‌ వేర్‌తో కొత్త మాస్క్‌.. ఇలా వెరైటీ హ్యాట్‌లతో పరీక్ష హాల్‌లో ప్రత్యక్షమయ్యారు. వివరాల్లోకెళ్తే.

ఫిలిప్పీన్స్‌లోని లెగాజ్‌పి నగరంలోనున్న బికోల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తమ స్టూడెంట్స్‌ ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టకుండా ఉండేందుకు అక్కడి విద్యార్ధులు ధరించిన వినూత్న యాంటీ చీటింగ్‌ హ్యాట్‌ (టోపీలు) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టూడెంట్స్‌ నుంచి ఇంతటి క్రియేటివిటీని ఊహించని టీచర్లు సైతం నోరెళ్ల బెట్టారు. అదే కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేరీ జాయ్ మండనే-ఓర్టిజ్ మీడియాతో మాట్లాడుతూ..’ఈ నెల (అక్టోబర్) మూడో వారంలో జరిగిన మధ్యంతర పరీక్షల (మిడ్‌ టర్మ్‌ ఎగ్జామ్స్‌)కు వేస్ట్‌ పేపర్లతో సింపుల్‌గా ఉండే యాంటీ-చీటింగ్ టోపీలతో ఎగ్జాం హాల్‌కు రావల్సిందిగా కోరాను. ఐతే మా స్టూడెంట్స్‌ హైలీ క్రియేటివ్‌ వర్షన్‌ టోపీలను తయారు చేశారు. హోమ్‌మేడ్‌ హెల్మెట్‌, పేపర్‌తో తయారైన బైనోక్యులర్‌ స్టైల్‌ గేర్‌, ఎగ్‌ బాక్స్‌లతో తయారు చేసిన భారీ టోపీలను ధరించి వచ్చారు. స్టూడెంట్స్‌ అందరూ పరీక్షలు బాగా రాశారు. ఒక్కరు కూడా చీటింగ్‌ చెయ్యలేదని’ ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఫిలిప్పీన్స్‌ తయారు చేసిన ఈ క్రియేటివ్‌ టోపీలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేస్కోండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే