UPSC Recruitment 2022: యూపీఎస్సీలో ఇన్విస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఇన్విస్టిగేటర్ గ్రేడ్-1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 15 ఇన్విస్టిగేటర్ గ్రేడ్-1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టిఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి అగ్రికల్చర్/అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్/బోటనీ/జువాలజీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/ఫజికల్ ఆంత్రోపాలజీ/జెనెటిక్స్/ఫోరెన్సిక్ సైన్స్/కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్ 11వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 అప్లి్కేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు: 1
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 2
- ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-I పోస్టులు: 12
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.