AP crime news: శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు..
రెండు గ్యాంగ్‌ల మధ్య కొట్లాట జరిగింది. దాని గురించి ఆ ఊరిలో పెద్ద పంచాయతీనే నడిచింది. కాకపోతే రెండు వర్గాల మధ్య కాదు. గ్రామస్తులు, పోలీసుల మధ్య. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం వెళ్లిన పోలీసులపైనే దాడి చేశారు ఈ గ్రామస్తులు. వివరాల్లోకెళ్తే..

శ్రీకాకుళం జిల్లాలోని లొద్దపుట్టిలో రెండు రోజుల క్రితం కొంత మంది యువకుల మధ్య కొట్లాట జరిగింది. దీనిపై ఆదివారం కేసు నమోదైంది. ఎంక్వైరీలో భాగంగా సోమవారం ఎస్సై రామకృష్ణతో పాటు సిబ్బంది గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో గ్రామంలో పెద్ద సమావేశమే జరిగింది. యువకుల మధ్య గొడవేంటి? పోలీసు కేసు ఎందుకు పెట్టారనే దానిపై గ్రామస్తులు చర్చిస్తున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు గ్రామస్తులు. తమ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా.. దుర్భాషలాడారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విచారణకు సహకరించకపోగా తిరిగి తమపైనే దాడి చేశారనేది పోలీసుల వాదన. ఏది ఏమైనప్పటికీ పోలీసులపైనే చేయి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్ చేయండి.