John Shaw: ప్రముఖ పారిశ్రామికవేత్త బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్ షా ఇంట విషాదం

బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్ షా భర్త జాన్‌ షా (73) సోమవారం (అక్టోబర్‌ 24) ఉదయం మరణించారు. జాన్‌ షా అనారోగ్యం కారనంగా ఈ రోజు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు..

John Shaw: ప్రముఖ పారిశ్రామికవేత్త బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్ షా ఇంట విషాదం
Biocon's ex VC John Shaw passes away
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2022 | 5:01 PM

బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్ షా భర్త జాన్‌ షా (73) సోమవారం (అక్టోబర్‌ 24) ఉదయం మరణించారు. జాన్‌ షా అనారోగ్యం కారనంగా ఈ రోజు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఐతే షా మృతికి ఖచ్చితమైన కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. షా గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న బయోకాన్‌ సంస్థ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అయిన జాన్‌ షా అంతిమ సంస్కారాలను బెంగళూరులోని విల్సన్‌ గార్డెన్స్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు షా కుటుంబ సన్నిహితులు వెల్లడించారు.

కాగా 1949లో జన్మించిన జాన్ షా.. కిరణ్‌ మజుందార్‌ను 1998లో వివాహం చేసుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లాండ్‌కు చెందిన జాన్‌ గ్లాస్గో యూనివర్సిటీ నుంచి షా హిస్టరీ, పొలిటికల్‌ ఎకానమీలో ఎంఏ (ఎకనామిక్స్ ఆనర్స్) పూర్తి చేశారు. గతంలో మదురా కోట్స్‌ లిమిటెడ్ ఛైర్మన్‌గా, కోట్స్ వియెల్లా గ్రూప్ మాజీ ఫైనాన్స్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా షా వ్యవహరించారు. వివాహం తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి (1999) బయోకాన్‌లో డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగా చేరారు. అనంతరం 2001లో కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ విదేశీ ప్రమోటర్‌గా, అడ్వైజరీ బోర్డు సభ్యుడిగానూ వ్యవహరించారు.

బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..