ఇలాంటి ఫైటు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. నడిరోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూస్తే
చిన్న చిన్న విషయాలకు కూడా మనుషుల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. కొన్నిసార్లు వారి పోరాటం తీవ్రంగా మారుతోంది. తమను తాము చంపుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడే ఇలాంటి..

చిన్న చిన్న విషయాలకు కూడా మనుషుల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. కొన్నిసార్లు వారి పోరాటం తీవ్రంగా మారుతోంది. తమను తాము చంపుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడే ఇలాంటి సందర్భాలు మీరు చాలానే చూసి ఉంటారు. నిజానికి కోపంలో ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు. కోపంలో ఉంటే అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అటువంటి పరిస్థితిలో ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది తీవ్రమైన గొడవే అయినప్పటికీ.. కాస్త ఫన్నీగా అనిపించే ఇన్సిడెంట్. ఈ ఫైట్ చూస్తే మీరు కచ్చితంగా నవ్వుతారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు అమ్మాయిలు రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. జుట్టు లాగడం, బెల్టులతో తలపడ్డారు. అదే సమయంలో చాలా మంది అక్కడ గుమిగూడి వారి ఘర్షణను చూస్తున్నారు. కానీ ఎవరూ వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. స్కూల్‌లో చదువుతున్న కొందరు బాలికలు ఒకరిపై ఒకరు బెల్టులు కొట్టుకుని జుట్టు పట్టుకుని లాగుతున్న తీరును వీడియోలో చూడవచ్చు. అంతే కాకుండా ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకోవడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ఎక్కడిది, పాఠశాల బాలికల మధ్య ఈ గొడవ ఎందుకు జరిగిందనే విషయాలపై సమాచారం లేదు.
Kalesh B/w Two Group of Girls On Street pic.twitter.com/E1eqb76PTl
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 22, 2022
ఈ ఫన్నీ ఫైట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం ఒక్క నిమిషం నిడివిగల ఈ వీడియోకు ఇప్పటి వరకు 26 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..