Andhra Pradesh: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా సిత్రాంగ్.. అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్.. స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లువాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుపానుగా..

Andhra Pradesh: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా సిత్రాంగ్.. అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్..
Cyclone Sitrang
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 24, 2022 | 5:03 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్.. స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లువాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఈ తుఫాన్ సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోంది అంటున్నారు. ఈ సిత్రాంగ్‌ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 475 కి.మీ దూరంలో.. సాగర్ ద్వీపానికి దక్షిణ-ఆగ్నేయంగా 780 కి.మీ, బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు దక్షిణంగా 880 కి.మీ. దూరంలో ఉంది. తెలిపారు. మంగళవారం ఉదయానికి బంగ్లాదేశ్‌లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

అయితే.. సిత్రాంగ్ తుపాన్ ప్రభావం ఏపీపై అంతగా ప్రభావం చూపించకపోవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం తుఫాన్‌గా మారితే తీర ప్రాంతాన్ని ఎక్కడా తాకకపోయినా హెచ్చరికలు ఇచ్చింది. తుఫాన్ హెచ్చరికల కేంద్రం రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెనక్కి వచ్చేయాలని సూచించారు.

తుపాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా కోస్తా జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 105 మండలాల అధికారలను తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం చేశారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని, అత్యవసర సహయం, తుఫాను సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు1070, 18004250101, 08632377118 సంప్రదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..