Mysterious Treasure: ప్రపంచంలో అపారవిలువ చేసే గుప్త నిధులు దాగున్న మర్మ ప్రదేశాలు ఇవే.. నేటికీ ఎవ్వరికంట పడలేదు..
బంగారు-వెండి నాణేలు, వజ్రాల నగలు వగైరా అపార విలువైన గుప్త నిధుల గురించి చందమామ కథల్లో, ఆలీబాబా నలభై మంది దొంగల కథల్లో విని వుంటారు. ఐతే ఇలాంటి గేప్త నిధులు నిజంగానే భూమిపై ఉన్నాయని మీకు తెలుసా? ఐతే ఇప్పటి వరకు ఆ నిధులను ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రపంచంలో ..
Updated on: Oct 24, 2022 | 3:50 PM

బంగారు-వెండి నాణేలు, వజ్రాల నగలు వగైరా అపార విలువైన గుప్త నిధుల గురించి చందమామ కథల్లో, ఆలీబాబా నలభై మంది దొంగల కథల్లో విని వుంటారు. ఐతే ఇలాంటి గుప్త నిధులు నిజంగానే భూమిపై ఉన్నాయని మీకు తెలుసా? ఐతే ఇప్పటి వరకు ఆ నిధులను ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రపంచంలో ఇలాంటి మర్మమైన నిధులు, వాటి నెనుక దాగి ఉన్న మిస్టరీలు మీకోసం..

1782వ సంవత్సరంలో గ్రోస్వెనార్ అనే ఓడ కోట్లాది బంగారు, వెండి నాణేలు, విలువైన వజ్రాలతో మద్రాసు నుంచి బయలుదేరింది. మధ్యలో ప్రమాదవశాత్తు కోట్ల విలువైన సంపదతో సహా సదరు నౌక దక్షిణాఫ్రికా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఓడ, దానిలో ఉన్న నిధి నేటికీ ఎవ్వరికీ చిక్కలేదు. అసలు అర్థంకాని పజిల్‌గా మిగిలిపోయింది.

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో సోన్ భండార్ అనే గుహ మూసివేయబడింది. ఈ గుహలో మగధ చక్రవర్తి బింబిసారుడు దాచిన నిధి ఉందని అందరరూ అనుకుంటున్నారు. ఐతే ఈ గుహను ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు.

జేన్ లాఫిట్, అతని అన్న పియరీ అనే సముద్రపు దొంగలు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఓడలను దోచుకునేవారట. ఇలా దోచుకోవడం ద్వారా అపారమైన సంపదను పోగు చేశారట. కానీ హఠాత్తుగా అతను మరణించాడు. దీంతో అతను దాచిన ఖజానా ఎక్కడుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు.

ఓక్ దీవిలో కోట్ల విలువ చేసే నిధి దాగి ఉంది. ఆ మర్మమైన నిధిని నేటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ కూడా ఈ నిధిని కనుగొనేందుకు విఫలయత్నం చేశాడు కనిపెట్టలేకపోయారు. అప్పటికి ఆయన అమెరికా ప్రెసిడెంట్‌గా ఇంకా పోటీ చెయ్యలేదు.
