Police Station: పోలీసు స్టేషన్ ముందు ఓ కుటుంబం నిరసన.. అసలు కారణం ఏంటంటే..!
రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ అక్కడ కూడా రక్షణ దొరక్కపోతే ఏం చేయాలి. అందుకే ఈ కుటుంబం ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలిపింది. ప్రకాశం జిల్లా..
రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ అక్కడ కూడా రక్షణ దొరక్కపోతే ఏం చేయాలి. అందుకే ఈ కుటుంబం ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలిపింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ కుటుంబం.. రోడ్డుపైనే బైఠాయించింది. ఎస్సై తీరుకు నిరసనగా ఆందోళనకు దిగింది. తమను వారం రోజులుగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ కూర్చున్న ఈ కుటుంబానిది మార్కాపురం మండలం బిరుదులనరవ. భూమి విషయంలో గ్రామంలో మరొకరితో వీళ్లకు వివాదం నడుస్తోంది. దానిపై కోర్టుకు వెళ్తే.. అనుకూలంగా తీర్పు వచ్చింది. పంటలు వేసుకుందామని పొలం బాగు చేసుకుంటుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారంటూ ఆరోపిస్తోంది కందుల సుబ్బమ్మ కుటుంబం. వారం రోజులుగా స్టేషన్‌కు పిలిచి వేధించడమే కాకుండా.. గ్రామంలోకి వచ్చి తమను వేధింపులకు గురిచేస్తున్నామంటూ వాపోతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇలా స్టేషన్ ముందే రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపారు. మార్కాపురం రూరల్ ఎస్సై సుమన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ గతంలో కూడా సివిల్ తగాదా విషయాల్లో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వివాదంలోనే ఆయన తలదూర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి