Andhra Pradesh: దీపావళి వేడుకల్లో విషాదం.. పటాసులు పేలుస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
మచిలీపట్నంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో దీపావళి టపాసులు కాలుస్తూ 11 ఏళ్ల బాలుడు వేమూరి లక్ష్మి నరసింహారావు మృతి చెందాడు. తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం పులగుర్తలోనూ బాణాసంచా తయారుచేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

దీపావళి పండుగ ఓ వైపు భారీగా సెలబ్రేషన్స్ జరిగితే.. మరోవైపు కొన్నిచోట్ల విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జరిగిన ప్రమాదాలు కొన్ని కుటుంబాలను చీకటిలోకి నెట్టాయి. చీకట్లు తొలగిపోవాలని.. జీవితంలో వెలుగులు ఉండాలంటూ చేసుకునే దీపావళి పండుగ రోజు కొన్ని కుటుంబాల్లో విషాదం మిగిలింది. క్రాకర్స్ కాలుస్తుండగా జరిగిన ప్రమాదాల్లో కొన్ని కుటుంబాలను చీకటిలోకి నెట్టాయి. మచిలీపట్నంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో దీపావళి టపాసులు కాలుస్తూ 11 ఏళ్ల బాలుడు వేమూరి లక్ష్మి నరసింహారావు మృతి చెందాడు. తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం పులగుర్తలోనూ బాణాసంచా తయారుచేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా మారడంతో రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రాజమండ్రి ఆవరోడ్డు రైతునగర్‌లోనూ ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందారు. కొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఇటు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తంగళ్లపల్లి టెక్స్ టైల్ పార్క్ లోని పౌరసరఫరాల ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలోని ఓ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో ఉన్న గన్ని సంచులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
ఆస్పత్రులకు కంటి బాధితుల క్యూ..
ఇక హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లోనూ విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కాల్చేటప్పుడు చాలామంది గాయపడ్డారు. ఇక చాలామంది కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, ఉస్మానియా ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం గమనార్హం. కాగా మొత్తం 30 మంది గాయపడ్డారని వారికి చికిత్స అందించినట్లు సరోజినీ దేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు. 12 మంది ప్రమాద బాధితులను సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నట్లు చెప్పారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..