Keerthy Suresh: పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అదిరిపోయే ట్రీట్‌

తన బర్త్‌డేను పురస్కరించుకుని తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది కీర్తి. తన అభిమానులకు చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించింది. అడిగిన వారందరికీ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చింది.

Keerthy Suresh: పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో అదిరిపోయే ట్రీట్‌
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2022 | 10:51 AM

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు కమర్షియల్‌ మూవీస్‌ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది మహానటి కీర్తి సురేశ్‌. సర్కారు వారి పాటలో మహేశ్‌తో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ చిన్ని సినిమాలో డీగ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌ పోషించి సినీ ప్రియులను మెప్పించింది. ప్రస్తుతం దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ క్వీన్‌ తాజాగా పుట్టిన రోజు (అక్టోబర్‌ 17) వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్‌డేను పురస్కరించుకుని తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది కీర్తి. తన అభిమానులకు చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించింది. అడిగిన వారందరికీ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చింది. అభిమానులు తెచ్చిన కేక్‌ను కట్ చేసింది. తర్వాత అందరితో కలసి భోజనం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనాథాశ్రమానికి విరాళం..

కాగా ఈపార్టీకి ముందు శాంతి వనం అనే అనాథాశ్రమంలోనూ తన బర్త్‌డే వేడుకలు జరుపుకుంది కీర్తి. అనాథపిల్లలకు బహుమతులు ఇవ్వడంతో పాటు వారి పోషణ కోసం కొంత మొత్తాన్ని విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ నెట్టింట్లో తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. గతంలో పలువురు స్టార్‌ హీరోలు ఇలా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ ఒక హీరోయిన్ ఇలా అభిమానులను కలుసుకోవడం ఇదే మొదటిసారని నెట్టింట్లో చర్చ నడుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో నటిస్తోంది కీర్తి. నేను లోకల్‌ తర్వాత నాని, కీర్తి సురేశ్‌ స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం ఇది రెండోసారి. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న ఈ మూవీ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

దసరాతో పాటు భోళా శంకర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది కీర్తి. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు. అలాగే ఉదయనిధి స్టాలిన్‌ ‘మామన్నన్‌, అలాగే జయం రవి సరసన సైరన్‌ సినిమాలను ఒప్పుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..