Actress Poorna: నాకు అప్పుడే పెళ్లైపోయింది.. ఆ కారణంతో ఎవరూ రాలేదు.. సంచలన విషయాలు బయటపెట్టిన పూర్ణ

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మే31న వ్యాపారవేత్త ఆసీఫ్‌ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి.

Actress Poorna: నాకు అప్పుడే పెళ్లైపోయింది.. ఆ కారణంతో ఎవరూ రాలేదు.. సంచలన విషయాలు బయటపెట్టిన పూర్ణ
Actress Poorna
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2022 | 7:38 AM

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కేరళ కుట్టి షమా ఖాసిమ్‌ అలియాస్‌ పూర్ణ. ఆతర్వాత సీమ టపాకాయ్‌, అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించడంతో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మే31న వ్యాపారవేత్త ఆసీఫ్‌ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ముద్దుగుమ్మ తమకు జూన్‌లోనే పెళ్లైపోయిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఆకారణంతోనే ..

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూర్ణ, అలీ దుబాయ్‌లో ఉంటున్నారట. తమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘మా నిశ్చితార్థం ఈ ఏడాది మేలో జరిగింది. జూన్‌ 12న దుబాయ్‌ వేదికగా మేం పెళ్లిపీటలెక్కాం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మా వివాహం జరిగింది. వీసా సమస్యల కారణంగా చాలామంది మా పెళ్లి వేడుకకు హాజరుకాలేకపోయారు. అందుకే త్వరలో కేరళ వేదికగా గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనున్నాం. అలాగే దుబాయ్‌లో ఒక డ్యాన్సింగ్‌ స్కూల్‌ ప్రారంభించనున్నాను. ఇది నా చిరకాల కోరిక ‘ అని చెప్పుకొచ్చింది. కాగా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పూర్ణకు అభిమానులు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది పూర్ణ. ఇందులో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. అలాగే వ్రితం అనే మళయాల సినిమాలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!