T20 World Cup: ప్రాక్టీస్‌ టైంలో కేకలు వేసిన ఫ్యాన్‌.. స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో హల్‌చల్‌

పాక్‌ అంటేనే రెచ్చిపోయే మన రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లీ కూడా పొట్టి ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టును గెలిపించాలని కసిగా ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంసీజీ మైదానంలో గంటల తరబడిబ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

T20 World Cup: ప్రాక్టీస్‌ టైంలో కేకలు వేసిన ఫ్యాన్‌.. స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో హల్‌చల్‌
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2022 | 10:59 AM

భారత్ వర్సెస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుణుడి ముప్పు పొంచి ఉన్నా కొద్దిపాటి ఓవర్లతోనైనా మ్యాచ్‌ జరుగుతుందన్న ఆశ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఉంది. ఈనేపథ్యంలో పాక్‌పై గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేసేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. గతేడాది వరల్డ్‌కప్‌ టోర్నీలో దాయాది దేశంలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం టీమిండియా ప్లేయర్లు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. ఇక పాక్‌ అంటేనే రెచ్చిపోయే మన రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లీ కూడా పొట్టి ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టును గెలిపించాలని కసిగా ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంసీజీ మైదానంలో గంటల తరబడిబ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో కోహ్లీని వీడియో తీస్తూ ఒక క్రికెట్‌ అభిమాని ‘అవుట్‌ ఆఫ్‌ ది స్టేడియం’ అని గట్టిగా అరిచాడు. ఇది విన్న విరాట్ వెంటనే వెనక్కు తిరిగాడు. ‘యార్‌ ప్రాక్టీస్‌ కే టైం మే బోలో మత్‌.. డిస్ట్రాక్షన్‌ హోతీ హై’ (దయచేసి ప్రాక్టీస్‌ టైంలో అలా కామెంట్లు చేయద్దు.. మా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని కేకలు వేసిన అభిమానికి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

ఏకాగ్రత దెబ్బతీయొద్దు..

ఇక్కడితో ఆగని ఆ అభిమాని..’ కింగ్‌ కోసం కచ్చితంగా అరిచి కేకలు పెడతాం.. నువ్వు కింగ్‌’ అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మామూలుది కాదు కదా.. అని ఒకరు అంటుంటే.. మరికొందరు ‘దేనికైనా ఒక లిమిట్‌ ఉంటుంది’ అంటూ భిన్న రకాలుగా కామెంట్లు చేస్తూ స్పందిస్తున్నారు. కాగా ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్‌ -12 మ్యాచ్‌లు ఇవాళ (అక్టోబర్‌ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం (అక్టోబర్‌22) మధ్యాహ్నం భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే మెల్‌బోర్న్‌ మైదానం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. భారీ వర్షం పడ్డా వెంటనే మైదానాన్ని సిద్ధం చేసే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిపాటి ఓవర్లతోనైనా మ్యాచ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..