Fact Check: రోడ్డు కావాలని నడుములోతు నీటిలో విద్యార్థుల నిరసన.. ఇందులో నిజమెంత?

భుత్వంమీద దుష్ప్రచారం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా కొందరు పిల్లలను నదిలో నిలబెట్టి ఒక వీడియో తీశారని, ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని విచారణలో తేలిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Fact Check: రోడ్డు కావాలని నడుములోతు నీటిలో విద్యార్థుల నిరసన.. ఇందులో నిజమెంత?
Cm Jagan
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2022 | 8:56 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని ఆధారంగా చేసుకుని మీడియాలో కూడా పలు కథనాలు ప్రచురితమయ్యాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన సీఎంవో ఇది ఫేక్‌ వీడియో అని పేర్కొంది. ప్రభుత్వంమీద దుష్ప్రచారం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా కొందరు పిల్లలను నదిలో నిలబెట్టి ఒక వీడియో తీశారని, ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని విచారణలో తేలిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వరాహనదిపై వంతెనపై రోడ్డు బాగానే ఉందని, పిల్లలు నదిని దాటాల్సిన అవసరం లేదని అందులో పేర్కొంది. అలాగే అప్రోచ్‌ రోడ్డు కోసం మరింత భూమిని సేకరించే పనిలో ఉన్నామని, త్వరలో రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని పేర్కొంది. ఈమేరకు వరాహనది వంతెనతో పాటు అప్రోచ్‌ రోడ్డు యథాతథ పరిస్థితులను తెలియజేస్తూ ఓ వీడియోను షేర్‌ చేసింది.

కాగా సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..